విద్యా నిధికి రూ.లక్ష విరాళం | Donation of Rs. 1 lakh to the schooling fund

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Mar 28 , 2025 | 10:46 PM

మహబూబ్‌నగర్‌ విద్యానిధికి మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి తన నెల జీతం నుంచి రూ.లక్ష వి రాళం అందించారు. అందుకు సంబంధించిన చెక్కును శుక్రవారం కలెక్టర్‌ విజయేందిర బోయికి అందజేశారు.

విద్యా నిధికి రూ.లక్ష విరాళం

కలెక్టర్‌కు చెక్కును అందిస్తున్న ఎమ్మెల్యే యెన్నం

నెల జీతం నుంచి అందించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ విద్యానిధికి మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి తన నెల జీతం నుంచి రూ.లక్ష వి రాళం అందించారు. అందుకు సంబంధించిన చెక్కును శుక్రవారం కలెక్టర్‌ విజయేందిర బోయికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌ విద్యానిధిని ఈ సంవత్సరం జనవరిలో ప్రారంభించినట్లు తెలిపారు. తన నెల జీతం నుంచి ప్రతీ నెల రూ.లక్ష చొప్పున విరాళాన్ని అందిస్తానని ఆ రోజు మాట ఇచ్చానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నెల విరాళం అందించనున్నట్లు తెలిపారు. విద్యానిధి అనేది మన మహబూబ్‌నగర్‌ పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి, వారి భవిష్యత్తు కోసమనేని స్పష్టం చేశారు. నగరానికి చెందిన వ్యాపారవేత్తలు, విద్యావంతులు, ఉద్యోగులు ముం దుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహా రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ ఖాద్రి, సీజే బెనహర్‌, శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date – Mar 28 , 2025 | 10:46 PM

Google News

Subscribe for notification
Verified by MonsterInsights