– డిడబ్ల్యూఓ లక్ష్మీరాజం
– బద్దనపల్లి లో ఆన్యువేల్ డే
నవతెలంగాణ-తంగళ్లపల్లి : విద్యార్థులు ఎంతో శక్తివంతమైన వాళ్లని డిడబ్ల్యూఓ లక్ష్మీరాజం అన్నారు. తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కూడా ఎంతో ఉత్సాహంగా రకరకాల ఆక్టివిటీస్ ని సోమవారం ఆన్యువేల్ డే కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపల్ పద్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిడబ్ల్యూ ఓ లక్ష్మీ రాజాం, ఎంఈఓ రాజు నాయక్ హాజరై మాట్లాడుతూ… విద్యార్థులు కష్టం అనుకోకుండా ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారాని అన్నారు.విద్యార్దులు చక్కగా చదివి గొప్పగా ఎదగలన్నారు. అనంతరం విద్యార్దులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా అందరినీ అలరించాయి. కార్యక్రమంలో డిసివో థెరీసా, నెరెళ్ళ రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్ రాధ, వేములవాడ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లావణ్య, లైబ్రేరియన్ సివోఈ సుష్మిత, పేరెంట్స్ కమిటీ లక్ష్మణ్, తల్లిదండ్రులు, విద్యార్దులు పాల్గొన్నారు.