నవతెలంగాణ -సుల్తాన్ బజార్ : విద్యార్థినులు పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలని కోఠి వీరనారి చాకలి ఐలమ్మ మహిళ వర్సిటీ వైస్ ఛాన్సలర్ సూర్య ధనుంజయ్ అన్నారు. సామాజిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోషల్ స్టడీస్’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులకు పరిశోధన పద్ధతులపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యశాలలు దోహదం చేస్తాయన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ. బి. శ్రీరంగేష్, ఓయూ సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ డైరెక్టర్ డాక్టర్.బి.రామ్ షెపర్డ్ తదితరులు అవ గాహన కల్పించారు. ప్రిన్సిపల్ డాక్టర్.లోకపావని, అధ్యాపకులు పాల్గొన్నారు