విద్యకు అధిక ప్రాధాన్యం | Schooling is a prime precedence.

Written by RAJU

Published on:


ABN
, Publish Date – May 01 , 2025 | 11:30 PM

ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. మండలంలోని కస్తూర్బా పాఠశాలలో కోటీ 49 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే గురువారం భూమిపూజ చేశారు.

విద్యకు అధిక ప్రాధాన్యం

కస్తూర్బాలో అదనపు భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కందుల

కస్తూర్బాలో అదనపు గదులకు ఎమ్మెల్యే కందుల భూమి పూజ

పొదిలి, మే 1 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. మండలంలోని కస్తూర్బా పాఠశాలలో కోటీ 49 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే గురువారం భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం నాలుగు కోట్ల రూపాయలు కస్తూర్బా పాఠశాలల్లో అవసరమైన గదుల నిర్మాణానికి మంజూరయ్యాయన్నారు. పొదిలి, గొట్లగట్టు, కలుజువ్వలపాడు, వెలుగొండ గురుకుల పాఠశాలలకు వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల చదువుపట్ల ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని కందుల కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో గుత్తా శోభన్‌బాబు, నగరపంచాయతీ కమిషనర్‌ నారాయణరెడ్డి, ఎంఈవో ఎం శ్రీనివాసరెడ్డి, కేజీబీవీ హెచ్‌ఎం అనురాధ, సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

చలివేంద్ర ప్రారంభం : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్‌, మాధవి ఆధ్వర్యంలో పొదిలి పెద్దబస్టాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన 24 గంటల కూలింగ్‌ తాగునీటి చలివేంద్రాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎండలు మండుతున్న సమయంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేస్తున్న గునుపూడిని అభినంధించారు.

Updated Date – May 01 , 2025 | 11:30 PM

Google News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights