భారతదేశం విభిన్న సంప్రదాయాలకు నిలయం. దేశంలోని ప్రతి ప్రాంతంలో వివాహాలు ఒక్కో సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. వారి కులం, మతం ప్రకారం, వారి ఆచారాలను అనుసరించి వివాహాలు జరుగుతాయి. వివాహం తర్వాత భర్త మరణిస్తే, ఆ స్త్రీని వితంతువుగా పరిగణిస్తారు. ఆమెను అశుభ వ్యక్తిగా బహిష్కరిస్తారు. కానీ, ఒక వర్గానికి చెందిన మహిళలు తమ భర్త మరణించిన పదవ రోజున తిరిగి వివాహం చేసుకుంటారు. ఏంటి ఇది చదవగానే షాక్ అవుతున్నారు కదా..? కానీ, ఇలాంటి ఆచారం మన భారతదేశంలోనే ఉంది.. ఎక్కడా.. ఏంటి ఆ ఆచారం అనే వివరాల్లోకి వెళితే…
అవును.. మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలో ఇలాంటి సంప్రదాయం ఉంది. ఇక్కడి గిరిజన మహిళలు తమ భర్తలు మరణించిన తర్వాత కూడా వితంతువుగా ఉండరు. సంప్రదాయం ప్రకారం, ఇక్కడి మహిళలు తమ భర్త మరణించిన 10వ రోజున తిరిగి వివాహం చేసుకుంటారు. ఈ మహిళలు తమ కుటుంబానికి చెందిన మరొక వ్యక్తితో తిరిగి వివాహం చేసుకుంటారు. ఆ పురుషుడు భర్త సోదరుడు కావచ్చు. వారి కుటుంబంలోని ఎవరైనా కావచ్చు.
ఆ మహిళ పెళ్లి వివాహం చేసుకోవడానికి ఎవరూ అందుబాటులో లేకుంటే..అందుకు మరో పరిష్కారం కూడా చూపిస్తారు. అలాంటి స్త్రీకి ఇక్కడ ప్రత్యేక వెండి కంకణం ధరిస్తారు. ఈ గాజు ధరించిన తర్వాత, ఆమెను వివాహిత మహిళగా పరిగణిస్తారు. ఈ గాజులను పోటా అంటారు. ఈ సంప్రదాయాన్ని మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలో జరుపుకుంటారు. బోడ్ తెగ నేటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తోంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..