భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు భగవంతుని చేరే మార్గాలు. భక్తికి ఫలం జ్ఞానం, జ్ఞానం ద్వారా మనిషిలో దైవత్వం నిండుతుంది. మనసుకి శాంతి, ఆత్మకు శక్తి నింపే భక్తిరస చిత్రం ‘శివాజ్ఞ’. సీనియర్ నటుడు భానుచందర్ అతిథి పాత్రలో నటించిన ఈ సినిమా ఈనెల 4న విడుదల కానుంది. శివ పరమాత్మ జ్ఞాన మందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో శివపరమాత్మ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా ఆధ్యాత్మికతతో కూడిన కథాంశంతో రూపొందింది.
ఆంధ్ర, తెలంగాణలోని 108 థియేటర్లలో మొదటి రోజు మొదటి నాలుగు ఆటలు ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నారు. ఈ సినిమా ఆధ్యాత్మికతతో పాటు కుటుంబ కథాంశాన్ని కూడా సమన్వయం చేస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రేక్షకులకు ఒక కొత్త ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించేందుకు ఈ సినిమా ఈనెల 4న థియేటర్స్‌లోకి రాబోతోందని మేకర్స్ తెలిపారు.
వెంకట్ గోవాడ, అశ్రిత వేముగంటి, కిరణ్, హర్షిణి, మాధవి, శ్రీనివాస్, శరత్, ప్రభావతి, జ్యోతి రాజ్, బ్రహ్మ కుమారి సిస్టర్ దీప్తి, హేమసుందర్ తదితరులు ఇందులోని ప్రధాన తారాగణం. కాగా శ్రీలక్ష్మి, తేజస్విని, అద్దేపల్లి శివ, విష్ణు తేజ, వర్ణ వంటి బాలనటీనటులు కీలక పాత్రలు పోషించారు.

విడుదల రోజు ఉచిత ప్రదర్శన

Written by RAJU
Published on: