విజువల్‌ వండర్‌గా ‘సేతు’

Written by RAJU

Published on:

విజువల్‌ వండర్‌గా ‘సేతు’అద్భుతమైన కథలను ప్రేక్షకులు ముందుకు తీసుకురావడంలో నిర్మాత అభిషేక్‌ నామ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన ‘సేతు’ అనే చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. దర్శకుడు హరికష్ణ ఈ చిత్రానికి మరొక ప్రత్యేకతను జత చేస్తూ, ప్రేక్షకులను అలరించేలా మాత్రమే కాకుండా అద్భుతమైన క్యాలిటీతో విజువల్‌ వండర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
‘పుష్ప, దసరా’ వంటి బ్లాక్‌బస్టర్లకు తన అద్భుతమైన గ్రాఫిక్స్‌తో పాపులర్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆర్టిస్ట్‌గా హరికష్ణ పేరొందారు. ఆయన ఈ సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రామాయణ కథా ప్రపంచాన్ని అద్భుతమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌తో బ్లెండ్‌ చేస్తూ ఒక కొత్త అనుభూతిని అందించబోతున్నారు. ‘సేతు’ భారతీయ పురాణాలలో ప్రసిద్ధమైన సంఘటనల ఆధారంగా రూపొందినా, ఇప్పటివరకూ వినని కల్పిత కథ. రామాయణంలోని యుద్ధాలు, వీర గాథలు, త్యాగం, ధర్మబద్ధత వంటి అంశాలను ఈ కథలో ప్రతిబింబించనున్నారు. యుద్ధ దశ్యాలు, విస్తతమైన ప్రకతి దశ్యాలు, పురాణ గాధల స్ఫూర్తిని అందించే విలక్షణమైన పాత్రలతో ఒక గొప్ప అనుభూతిని ఈ సినిమా ఇవ్వనుంది.

Subscribe for notification
Verified by MonsterInsights