‘వాట్స్‌పలో ప్రశ్నాపత్రం’ ఎవరికోసం..?

Written by RAJU

Published on:

పూర్తిస్థాయి విచారణ చేపట్టిన అధికారులు

ఇన్విజిలేటర్‌ సస్పెన్షన్‌

విధుల నుంచి చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారి తొలగింపు

పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ఇలాత్రిపాఠి

నల్లగొండ, మార్చి 22 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): పదో తరగతి తెలుగు-1 ప్రశ్నప త్రం వాట్సప్‌ గ్రూపుల్లో ప్రత్యక్షమైన ఘటనపై ప్రభుత్వం విచారణ నిర్వహిస్తోంది. ప్రశ్నపత్రం నకిరేకల్‌ ఎస్సీ గురుకుల విద్యాలయం పరీక్షా కేంద్రం నుంచే లీక్‌ అయిందని నిర్థారణకు వచ్చిన విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రశ్నాపత్రం ఫొటో తీశారని భావించిన విద్యార్థినిని డీబార్‌ చేశారు. ఆ పరీక్ష హాల్‌ ఇన్విజిలేటర్‌ సుధారాణిని సస్పెండ్‌ చేయగా, పరీక్షా కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ గోపాల్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారి రామ్మోహన్‌రెడ్డిని విధుల నుంచి తొలగించారు. మొత్తం ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. నకిరేకల్‌ సర్కిల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తుండగా, విద్య, రెవె న్యూ, పోలీసుశాఖల ద్వారా సంయుక్త విచారణ కొనసాగుతోంది. వాట్స్‌పలో ప్రశ్నాపత్రం వెలువడటాన్ని సీరియ్‌సగా తీసుకున్న ప్రభుత్వం ఒకవైపు వదంతు లు వ్యాప్తి చేయవద్దని హెచ్చరిస్తూ, మరోవైపు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించగా, నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ఇలాత్రిపాఠి విచారణకు ఆదేశించారు. మరోవైపు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆమె ఎస్పీ శరత్‌చంద్రపవార్‌తో కలిసి పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. విద్య, రెవెన్యూ, పోలీస్‌ అధికారుల నుంచి ప్రాథమిక సమాచారం సేకరించారు.

ఎవరి కోసం, ఎవరు చేశారనే కోణంలో దర్యాప్తు..

వాట్స్‌పలో ప్రశ్నపత్రం వెలుగుచూసి న ఘటనలో కీలకమైన అంశాలపై పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పూర్తిభద్రతతో పాటు, ఫోన్లకు అనుమతి లేదని, వంద మీటర్ల వరకు బీఎన్‌ఎ్‌సఎ్‌స 163 సెక్షన్‌ అమలు ఉంది. అయినా ఫొటో తీసిన వ్యక్తి పరీక్షా కేంద్రంలోకి ఎలా వచ్చారనే అంశంపై విచారణ చేస్తున్నారు. పరీక్ష కేంద్రం వద్ద పోలీసు సిబ్బంది, పరీక్షల అధికారులు, ఇన్విజిలేటర్లను దాటుకొని సదరు వ్యక్తి పరీక్షా కేంద్రంలోకి ఎలా వెళ్లారని ఆరా తీస్తున్నారు. పరీక్షా హాల్‌లోకి వెళ్లి మొబైల్‌ ఫొన్లో ఫొటో తీసేంతవరకు ఎవరూ ఎందుకు స్పందించలేదు అనేది పరిశీలించాల్సిన అంశం గా భావిస్తున్నారు. అందుబాటులో ఉన్న బాలిక ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీయడంతో సదరు బాలికను డీబార్‌ చేశారు. విషయం బయటకు పొక్కడంతో శుక్రవారం హడావుడిగా విచారణ జరిపి లోలోపల విషయాన్ని దాటవేయాలని చూశారని తెలుస్తోంది. అప్పటికే విషయం పూర్తిగా బయటకు రావడంతో అర్థరాత్రి దాటాక అప్పటికప్పుడు ఇన్విజిలేటర్‌ని సస్పెండ్‌ చేశారని, అదేవిధంగా సీఎ్‌సని, డీవోని విధుల నుంచి తొలగించారని భావిస్తున్నారు. మొత్తంగా ఈ ప్రశ్నాపత్రం ఎవరు ఫొటో తీశారనే విషయాన్ని తేల్చాలని, ఎవరి కోసం ఈ ఘటనకు పాల్పడ్డారో విచారణలో తేల్చాలని, ఒకరిద్దరి కోసమే చేశారా..? లేక ఇతర ప్రైవేట్‌ శక్తుల ప్రయోజనాలు ఉన్నాయా..? అనే అంశాన్ని విచారణలో తేల్చాలనే డిమాండ్‌ వెలువడుతోంది. పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసుల నిర్లక్ష్యం, పరీక్షా కేంద్రం నిర్వహణాధికారుల పాత్ర కూడా విచారణలో తేలనుందని చెబుతున్నారు. ఆదివారంలోగా పూర్తి విచారణ నిర్వహించి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ, పోలీ్‌సశాఖ వర్గాలు చెబుతున్నాయి. విచారణ నివేదిక వచ్చాక బాఽధ్యులైన అధికారులు, ఉద్యోగులపై వేటు తప్పదని తెలుస్తోంది.

పేపర్‌ లీక్‌పై లోతుగా పోలీసుల విచారణ

పరీక్ష కేంద్రం నిర్వాహకులను రెండో రోజు కూడా విచారిస్తున్నారు. ఓ మైనర్‌ బాలుడు ప్రశ్నపత్రాన్ని ఫొటో తీశారని చర్చ జరుగుతోంది. అయితే సదరు బాలుడు ఎవరి కోసం ఈ ఫొటో తీశారనే కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలిసింది. నల్లగొండ, నకిరేకల్‌ పోలీసులు దీనిపై దృష్టి పెట్టి కాల్‌ రికార్డింగ్స్‌, వాట్సప్‌ మెసేజ్‌ డేటా సేకరిస్తున్నట్లు తెలిసింది

Subscribe for notification