
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రజలకు స్వచ్ఛత, సురక్షితమైన తాగునీరు అందించడానికి ఆర్ఓఆర్ ప్లాoట్ షెడ్డు నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించాలని మండల తహశీల్దార్ రవికుమార్ కు గురువారం తహశీల్దార్ కార్యాలయంలో తాడిచెర్ల,కాపురం గ్రామాల జెన్కో భూ నిర్వాసితుల హక్కుల సాధన పోరాట కమిటీ అధ్యక్షుడు కేశారపు రవి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఇందుకు మండల తహశీల్దార్ సానుకూలంగా స్పందించినట్లుగా ఆయన పేర్కొన్నారు.ఇటీవల కాపురం ఓసిపి బ్లాక్-1లో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ హెడ్ ఆపీస్ హైదరాబాద్ లో ఈ నెల 4న కంపెనీ వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథ రాజు కు భూ నిర్వాసితుల హక్కుల పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధులతో తాడిచెర్ల ప్రజలకు ఆర్ఓఆర్ ప్లాoట్ ద్వారా సురక్షితమైన తాగునీరు అందించాలని విన్నవించిన విషయం తెలిసిందే.ఇందుకు రెవెన్యూ శాఖ ద్వారా స్థలాన్ని సేకరిస్తే తాము ప్లాoట్ నిర్మాణం చేస్తామని ఏఎమ్మార్ అధికారులు తెలిపినట్లుగా తెలుస్తోంది.