వంద పడకల ఆసుపత్రి మంజూరుపై హర్షం

Written by RAJU

Published on:

– సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కశిరెడ్డి చిత్ర పటాలకు క్షీరాభిషేకం

కల్వకుర్తి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : నియోజక వర్గ కేంద్రమైన కల్వకుర్తికి వంద పడకల ఆసుపత్రి మంజూరు చేయడంపై కాంగ్రెస్‌ నాయకులు హ ర్షం ప్రకటించారు. శనివా రం పట్టణంలోని అంబే డ్కర్‌ చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డిల చిత్రపటాలకు కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకు డు బృంగి ఆనంద్‌కుమార్‌ ఆధ్వర్యంలో క్షీరాభి షేకం నిర్వహించారు. ఆనంద్‌కుమార్‌ మాట్లా డుతూ కల్వకుర్తి పట్టణంలో ఆసుపత్రి నిర్మాణా నికి రూ.45.50 కోట్లు మంజూరయ్యాయని తెలి పారు. కార్యక్రమంలో మార్కెట్‌ డైరెక్టర్‌ పసుల రమాకాంత్‌రెడ్డి, వెల్దండ మాజీ సర్పంచ్‌ ఎన్నం భూపతిరెడ్డి, నాయకులు విజయ్‌ కుమార్‌రెడ్డి, జిల్లెల రాములు, దామోదర్‌గౌడ్‌, చిన్న రాంరెడ్డి, గోరటి శ్రీనివాసులు, రామరాజు, రవీందర్‌, చిన్న, బాలునాయక్‌, రేష్మా, శ్రీధర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, షాహీర్‌, కేశవులు, వెంకటేశ్‌, శ్రీశైలం, మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date – Mar 08 , 2025 | 11:12 PM

Subscribe for notification