ABN
, Publish Date – Mar 22 , 2025 | 12:19 AM
లైంగిక నేరాలపై పిల్లలు అప్రమత్తంగా ఉండాలని సీని యర్ సివిల్ న్యాయాధికారి జె. శ్రీనివాసరావు అన్నారు.

టెక్కలి: మాట్లాడుతున్న సీనియర్ సివిల్ న్యాయాధికారి శ్రీనివాసరావు
టెక్కలి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): లైంగిక నేరాలపై పిల్లలు అప్రమత్తంగా ఉండాలని సీని యర్ సివిల్ న్యాయాధికారి జె. శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం బన్నువాడలో న్యాయవిజ్ఞాన సద స్సు నిర్వహించారు. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడడం చట్టరీ త్యా నేరమని, అటువంటి వారిపై కఠినచర్యలు తీసుకుంటారన్నారు. 18 ఏళ్ల లోపు పిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవడం, వారిని లైంగిక వేధింపుల నుంచి కాపాడడం కోసం ప్రభుత్వం పోక్సో చట్టాన్ని రూపొందించిందన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దివ్వల వివేకానంద, న్యాయవాదులు మధుబాబు, బాలకృష్ణ, ఆనందరావు, ఎస్‌ఐ రాము, సర్పంచ్ మోహనరావు, ఎంపీటీసీ ఫాల్గుణరావు, నీటి సంఘం అధ్యక్షుడు మురళీధర్ పాల్గొన్నారు.
సత్ప్రవర్తనతో మెలగాలి
కొత్తూరు, మార్చి 21(ఆంరఽధజ్యోతి): విద్యార్థినులు సత్ప్రవర్తనతో మెలిగి ఉన్నత శిఖరాలు అందుకోవాలని జూనియర్ సివిల్ న్యాయాధికారి ఎస్. మణి అన్నారు. శుక్రవారం వసప కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. బాలికలు లైంగిక వేధింపులకు గురైతే వాటిని ఎదుర్కొనేలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ధైర్యంగా సంబంధిత అధికారులకు తెలియజేయాలని, అటువంటి వారి వివరాలు గోప్యంగా ఉంచబడ తాయన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటారన్నారు. కార్యక్రమంలో బార్ అసోషియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.అప్పారావు, వలురౌతు సుధాకరరావు, న్యాయవాదులు రెడ్డి ఉమామహేశ్వరావు, గేదల ఫల్గుణరావు, అరుబోలు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date – Mar 22 , 2025 | 12:19 AM