– భక్తజన సంద్రంగా సలేశ్వరం
– మూడు రోజుల్లో 3 లక్షలకు పైగా భక్తులు
– శివనామస్మరణతో మార్మోగిన నల్లమల
– పలుచోట్ల ట్రాఫిక్ జామ్
– బస్సులు నడపొద్దని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు
– తిరుగు ప్రయాణానికి తప్పని తిప్పలు
అచ్చంపేట, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): సలేశ్వర లింగమయ్య స్వామిని దర్శించుకొనేందుకు ఏటేటా భక్తుల తాకిడి పెరుగుతు న్నది. లింగమయ్యస్వామి చైత్ర పౌర్ణమి రోజుకు రెండు రోజులు ముందు రెండు రోజులు తరువాత స్వామి దర్శనం ఉంటుంది. చెం చులే ప్రధాన పూజారులుగా స్వామి సేవలో తరిస్తారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో నల్లమల అభయారణ్యం భక్తజన సం ద్రంగా మారింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. స్వామి దర్శనం కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో నడక దారిలో వేచి చూడాల్సి న పరిస్థితి నెలకొంది. అష్టకష్టాలు పడుతూ లింగమయ్యను దర్శ నం చేసుకొని పోయివస్తాం లింగమయ్యా అంటూ భక్తులు తిరుగు పయనమయ్యారు. ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చా రు. ఆర్టీసీ అధికారులు మధ్యాహ్నం నుంచి బస్సులు నడపక పోవడంతో తిరుగు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, లింగమయ్య దర్శనానికి వచ్చిన ఓ మహిళ బస్సు ఎక్కే ప్రయత్నం లో స్వల్ప గాయాలయ్యాయి.
సలేశ్వర పరిసరాల్లో కోరికల కోటలు
సలేశ్వర లింగమయ్య దర్శనం తరువాత స్వామి క్షేత్రంలో తమ కోరికలు నెరవేరాలని రాళ్లతో పేర్చి కోటలు కడతారు.. కొత్త ఇల్లు క ట్టుకోవాలంటే బండరాళ్లను ఒకదానిపై మరొక రాయిని పేర్చుతారు. తమ పిల్లల పెళ్లి కావాలని చిన్న పందిరి వేస్తారు. సంతానం కలగా లని కొత్త వస్ర్తాలతో ఊయలలు కడతారు. ఇలాంటి ఆనవాళ్లు ఆల య పరిసరాల్లో దర్శనమిస్తున్నాయి. కోరిన కోరిక తీరగానే మొక్కు తీర్చు కొనేందుకు కొత్త జంటలు, చిన్నపిల్లల తల్లిదండ్రులు ఈ క్షేత్రానికి తరలి వస్తున్నారు.
ప్రభుత్వ సహకారం ఉండాలి
ఏటేటా భక్తులు ఎక్కువగా వస్తున్నారు. మోకాళ్ల కురువ నుంచి లోయ మొత్తం భక్తులు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేశాం. 40 మంది చెంచు వలంటీర్లు పని చేస్తున్నారు. స్వామి వారికి ప్రధాన పూజారిగా తోకల చిన్నమల్లయ్య పూజలు చేస్తున్నాడు. ఆలయ కమిటీ నుంచి 12 వాకీటాకీలను సమకూర్చుకొని ఎక్కడ ఏమి జరిగినా తక్షణమే తెలుసుకొని పోలీసుల సహకారంతో ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలంటే మా సంప్రదాయాల కనుగుణంగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలి.
-తోకల గురువయ్య, సలేశ్వర లింగమయ్యస్వామి ఆలయ కమిటీ కార్యదర్శి