దేశ దిశ

రోబోట్‌ కుక్క వల్ల చిక్కుల్లో BCCI.. ఏకంగా హైకోర్టు నుంచి నోటీసులు!

రోబోట్‌ కుక్క వల్ల చిక్కుల్లో BCCI.. ఏకంగా హైకోర్టు నుంచి నోటీసులు!


ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ చట్టపరమైన చిక్కుల్లో పడింది. ఐపీఎల్‌ 2025 మధ్యలో ఢిల్లీ హైకోర్టు బీసీసీఐకి నోటీసు పంపింది. బీసీసీఐ ఇటీవల ఐపీఎల్‌లో రోబోట్ డాగ్‌ను ప్రవేశ పెట్టింది. ఈ రోబో కుక్కను ఐపీఎల్ మ్యాచ్‌ల టాస్ సమయంలో ఉపయోగిస్తారు. ఈ కుక్క ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్ల ఫొటోలు, వీడియోలు తీస్తూ సందడి చేస్తోంది. కొన్ని రోజుల క్రితం రోబోట్‌ డాగ్‌కు చంపక్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ పేరు బీసీసీఐకి తలనొప్పి తెచ్చిపెట్టింది.

నిజానికి ఒక ప్రసిద్ధ పిల్లల పత్రిక పేరు కూడా చంపక్, అందుకే ఈ కంపెనీ బీసీసీఐకి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టును కోర్టును ఆశ్రయించింది. రోబో కుక్కకు చంపక్ అని పేరు పెట్టడం ద్వారా బీసీసీఐ రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌ను ఉల్లంఘించిందని పత్రిక డైరెక్టర్ల బోర్డు ఆరోపించింది. రోబో కుక్కకు చంపక్ అని పేరు పెట్టడంపై స్పందన కోరుతూ ఢిల్లీ కోర్టు బీసీసీఐకి నోటీసు జారీ చేసింది. హైకోర్టు ఆదేశం ప్రకారం, బీసీసీఐ రాబోయే నాలుగు వారాల్లోగా తన లిఖితపూర్వక ప్రతిస్పందనను సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసుపై జూలై 9న ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Exit mobile version