
– ఒకరు మృతి… ముగ్గురికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-బెజ్జంకి
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో రాజీవ్ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలానికి చెందిన ఒకరు మృతి చెందగా..ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సిద్దిపేట నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆటోలో మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామానికి చెందిన దంపతులు బీరెడ్డి నక్షత్రం(58), బీరెడ్డి ఆనంద్ రెడ్డి, దాచారం గ్రామానికి చెందిన కొలిపాక మంజుల, మండల కేంద్రానికి చెందిన ఐలేని నవీన్ రెడ్డి ప్రయాణిస్తున్నారు. రేణికుంట గ్రామ శివారులోని వెంకటేశ్వర ఆలయం వద్ద రాజీవ్ రహదారిపై లారీ, ఆటో డికొన్న సంఘటనలో బీరెడ్డి నక్షత్ర అక్కడికక్కడే మృతి చెందగా ఆనంద్ రెడ్డి, కొలిపాక మంజుల, ఐలేని నవీన్ రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాధితులు కరీంనగర్ పట్టణంలోని ప్రయివేట్ ఆసుపత్రుల యందు చికిత్స పొందుతున్నారు.