RRB ALP Result 2025 CBT 1 Date : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగ రాత పరీక్ష ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. పూర్తి వివరాల్లోకెళ్తే..
హైలైట్:
- ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ రిక్రూట్‌మెంట్ 2025
- మొత్తం 18,799 ALP పోస్టుల భర్తీ
- త్వరలో సీబీటీ 1 ఎగ్జామ్ రిజల్ట్ విడుదల

మొత్తం 18,799 ALP పోస్టుల భర్తీ
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 18,799 అసిస్టెంట్ లోకో పైలట్ (Assistant Loco Pilot) ఉద్యోగాలకు 2024 జనవరి నెలలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (Railway Recruitment Board) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో 2,528 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అయితే.. ఈ ALP పోస్టుల భర్తీకి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షలు (CBT) 2024 నవంబర్ 25, 26, 27, 28, 29 తేదీల్లో నిర్వహించారు. ఫస్ట్ స్టేజ్ సీబీటీ-1, సెకండ్ స్టేజ్ సీబీటీ-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారనే విషయం తెలిసిందే.
ఏఎల్‌పీ ఖాళీలు భర్తీ చేయనున్న రీజియన్లు ఇవే:
అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబై, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.. తదితర ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో ఈ అసిస్టెంట్ లోకో పైలట్ (RRB ALP) పోస్టులను భర్తీ చేయనున్నారు.
RRB ALP వేతనం ఎంత ఉంటుందంటే?
ఆర్‌ఆర్‌బీ Assistant Loco Pilot పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతం ఉంటుంది. అయితే.. పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
11,558 ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఉద్యోగాలు.. త్వరలో ఎగ్జామ్ డేట్స్ ఖరారు
RRB NTPC Exam Date 2025 : ఆర్‌ఆర్‌బీ (RRB) త్వరలో నాన్- టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సంబంధించిన తేదీలు, అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేయనుంది. అయితే.. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ యూజీ, గ్రాడ్యుయేట్- లెవల్ పరీక్షలకు సంబంధించిన పరీక్ష తేదీలను ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లలో త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. పూర్తి వివరాలకు లింక్ ఇదే.