ABN
, Publish Date – Mar 31 , 2025 | 01:45 AM
రైతులకు మేలు చేకూర్చే ఉద్దేశంతో రిలయల్స్ సంస్థ ద్వారా బయోగ్యాస్ యూనిట్‌ను కనిగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. స్థానిక రామనగర్‌లోని తన కార్యాల యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు.

ఒంగోలు ఎంపీ మాగుంట
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : రైతులకు మేలు చేకూర్చే ఉద్దేశంతో రిలయల్స్ సంస్థ ద్వారా బయోగ్యాస్ యూనిట్‌ను కనిగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. స్థానిక రామనగర్‌లోని తన కార్యాల యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. రిలయన్స్ సంస్థకు సొంత భూములు కౌలుకు ఇస్తే ఎకరాకు సంవత్సరానికి రూ.31,000 ఇస్తారన్నారు. సొంతంగా సాగు చేసే రైతులకు సంస్థ విత్తనాలు, ఎరువులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ప్రోత్సహిస్తుందన్నారు. అలా సాగు చేయడం వల్ల రూ.60వేలకుపైగా ఆదాయం లభిస్తుందని తెలిపారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రిలయన్స్ సంస్థ రూ.66వేల కోట్లతో 550 యూనిట్లను పెట్టాలని నిర్ణయించగా, అందులో మొట్టమొదటిగా కనిగిరి ప్రాంతంలో బయోగ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. మంత్రి లోకేష్ కనిగిరి ప్రాంత సమస్యలను గుర్తుంచుకొని పరిశ్రమ శంకుస్థాపనకు రానుండటం శుభపరిణామమన్నారు. అనంత్ అంబానీ రావడం వల్ల కనిగిరి ప్రాంతానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీ మాగుంట ద్వారా సీఎస్‌ఆర్ నిధులు రాబట్టి కనిగిరి ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ వైద్యశాల ఏర్పాటు చేస్తామన్నారు.
Updated Date – Mar 31 , 2025 | 01:45 AM