జూన్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుఖాణాల్లో సరుకులతో పాటు సబ్సిడీపై కందిపప్పు, ఉచితంగా రాగులు ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మూడు నెలలకు సరిపడా కందిపప్పు, ఏడాదికి సరిపడా రాగులను సేకరించేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. రేషన్ కార్డుదారులతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఐసీడీఎస్ లబ్ధిదారులకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సరిపడేలా 500 కోట్ల విలువైన 47వేల 037 టన్నుల కందిపప్పు, 100 కోట్లకుపైగా విలువైన 25 వేల టన్నుల రాగులు, 43వేల 860 టన్నుల పంచదార సేకరణకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానంలో ఎన్‌ఈఎంఏల్ పోర్టల్ ద్వారా టెండర్లు ఆహ్వానించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.46 కోట్లకుపైగా రేషన్‌కార్డుదారులు ఉన్నారు. వీరందరికీ రేషన్ షాపుల ద్వారా అందించే బియ్యానికి బదులుగా రాగులను ఉచితంగా పొందే అవకాశం కూడా కల్పిస్తున్నారు. వచ్చే నెల నుంచి రేషన్ కార్డుల్లో మార్పు చేర్పులు చేసి ఏటీఎం సైజులో, క్యూఆర్ కోడ్‌తో జారీ చేసేందుకు ఏపీ సర్కారు సిద్ధమవుతోంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని ప్రకటించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంతానం కలిగేలా చేస్తామన్నారు.. కట్‌చేస్తే..
వందేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో బతకాలంటే ?? డాక్టర్ సూచన..!
కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేసిన డాక్టర్లకు షాక్..
నల్ల నేరేడు కాదు..తెల్ల నేరేడు.. తింటే వదలరు..!
తండ్రికి మరిచిపోలేని గిఫ్ట్ ఇవ్వాలనుకుంది..చివరికి అంతులేని శోకం మిగిల్చింది !!