మార్కాపురం మార్కెట్ కమిటీకి వెంకటరెడ్డ్డి.. గిద్దలూరుకు బాలయ్యయాదవ్
మార్కాపురం/గిద్దలూరు టౌన్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రెండు మార్కెట్ యార్డు కమిటీలకు చైర్మన్‌లను ప్రభుత్వం ప్రకటించింది. మార్కాపురానికి మాలపాటి వెంకటరెడ్డి నియమితులయ్యారు. గిద్దలూరు ఏఎంసీ చైర్మన్‌గా బైలడుగు బాలయ్యయాదవ్‌కు అవకాశం దక్కింది. రాష్ట్రప్రభుత్వం మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో జీవోను విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర పార్టీ కార్యాలయం రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 47 వ్యవసాయ మార్కెట్ కమిటీలను క్లియరెన్స్ ఇచ్చి మార్కెటింగ్‌శాఖకు పంపింది. అందులో జిల్లాలోని గిద్దలూరుతోపాటు మార్కాపురం కమిటీ కూడా ఉంది. మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబందించి కూటమి ప్రభుత్వంలోని అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకొని జాబితాను స్థానిక శాసనసభ్యుడు కందుల నారాయణరెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. చైర్మన్‌గా మాలపాటి వెంకటరెడ్డి, వైస్‌చైర్మన్‌గా దొండపాటి వెంకటేశ్వర్లు, డైరెక్టర్లుగా పిన్నెబోయిన రాజ్యలక్ష్మి, పసుపులేటి దేవప్రసాదరావు, కాటమల చెన్నమ్మ, పట్లావత్ భీమానాయక్, వట్టి రవణమ్మ, తానుగుండాల రామసుబ్బులు, చాతరాజుపల్లి వెంకటప్రవీణ్, రాచకొండ భారతి, దుగ్గెంపుడి వెంకటరవణమ్మ, షేక్ మస్తాన్‌బాబు, పూజల లక్ష్మి, పెరుమాళ్ల హరీష్‌బాబు, తడికమళ్ల భాస్కర్‌రావుల జాబితాను ప్రభుత్వానికి అందజేశారు. త్వరలోన్తే ప్రభుత్వం జీవోను విడుదల చేయనుంది.
గిద్దలూరుకు బాలయ్యయాదవ్
గిద్దలూరు మార్కెట్‌యార్డు చైర్మన్‌గా బైలడుగు బాలయ్యయాదవ్ నియమితులయ్యారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సిఫారసు మేరకు బాలయ్యయాదవ్‌ను ఈ పదవి దక్కింది. బైలడుగు బాలయ్యయాదవ్ టీడీపీ నాయకులుగా కొనసాగుతూ, వృత్తిపరంగా శల్యవైద్యునిగా ఈ ప్రాంతానికి సుపరిచితుడు. టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా బాలయ్యయాదవ్ పార్టీ కోసం పని చేస్తున్నారు. గడిచిన ఎన్నికలలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. త్వరలో మార్కెట్‌యార్డు చైర్మన్‌గా బాలయ్యయాదవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే వైస్‌చైర్మన్, డైరెక్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వైస్‌చైర్మన్, డైరెక్టర్ల నియామకం కోసం కసరత్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలయ్యయాదవ్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తానని, మార్కెట్‌యార్డు ద్వారా గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో గిద్దలూరు, కంభం మార్కెట్‌యార్డులు ఉన్నాయి. శుక్రవారం ప్రకటించిన జాబితాలో గిద్దలూరు ఉండగా కంభం మార్కెట్‌యార్డు కమిటీ చైర్మన్‌ను ప్రకటించాల్సి ఉంది.