– 122 పంటలకు వర్తింపు
– ఈసారి స్వల్పంగానే పెంపుదల
– వరికి రూ.45వేలు, పత్తికి రూ.21వేల పరిమితి
– నాబార్డు వ్యవసాయ రుణ లక్ష్యం రూ.3189.07 కోట్లు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
వానాకాలం సీజన్ ఆరంభానికి ముందే పంట రుణాల పరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) ప్రణాళికను ఖరారు చేశారు. రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ నిర్ణయం మేరకు 2025-26 వానాకాలం, యాసంగి సీజన్‌లకు సంబంధించిన 122 పంటలకు సంబంధించి రుణ పరిమితిని పెంచారు. గతేడాదితో పోలిస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగు చేసే ప్రధాన పంటల్లో కొన్ని పంటలకు మాత్రమే స్వల్పంగా పరిమితి పెరిగింది. జిల్లాలో ప్రధానంగా వరి సాగు ఎక్కువగా ఉంటుంది. ఈసారి వరి, కంది, మొక్కజొన్న, మినుములు, పెసర, శెనగ, జొన్న తదితర పంటలకు రుణ పరిమితి పెంచలేదు. పత్తి సాగుకు రూ.2 వేలు మాత్రమే పెంచారు. గతేడాది రూ.46 వేల వరకు ఉండగా ఈసారి రూ.48 వేలకు పెరిగింది. పాడి రైతులకు డెయిరీ పెట్టుకోవడానికి అవుకు, గేదేకు రూ.33 వేల నుంచి రూ 35 వేల వరకు రుణం ఇవ్వాలని సూచించారు. గొర్రెలు,మేకలు కొనుగోలుకు సంబంధించి రూ.29 వేలు, ఒక్కో కోడిపిల్లకు రూ.200 నుంచి రూ.210 చొప్పున, చేపలు ఒక హెక్టార్‌కు రూ.4 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. స్కేల్ ఆప్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకర్లు రుణ లక్ష్యాలను అధిగమించే ప్రయత్నం చేస్తున్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఫ నాబార్డు రుణ లక్ష్యం రూ.3948 కోట్లు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.3948.01 కోట్లు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్(నాబార్డ్) రుణం అందించాలని ప్రణాళికలు రూపొందించింది. ప్రొటెన్సియన్ లింక్‌డ్ క్రెడిట్ ప్లాన్(పీఎల్‌ఫీ)ని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సమక్షంలో గత నెలలో నాబార్డు డీడీఎం దిలీప్ చంద్రం, ఎల్‌డీఎం మల్లికార్జున్‌రావు, డీఆర్‌డీవో శేషాద్రి, డీసీవో రామకృష్ణలు విడుదల చేశారు. దాని ప్రకారం జిల్లాకు రూ.3948.01 కోట్ల రుణ సహాయాన్ని అందించాలని జిల్లాలోని బ్యాంక్‌లకు నిర్దేశించింది. గతేడాది లక్ష్యంకంటే 23శాతం అదనంగా రూపొందించారు. వ్యవసాయానికి రూ.3189.07 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.612.30 కోట్లు, ఎగుమతులకు రూ.3.20 కోట్లు, విద్యారంగానికి రూ.28 కోట్లు, గృహ నిర్మాణాలకు రూ.40.04 కోట్లు, సామాజిక మౌలిక సదుపాయాలకు రూ.10.80 కోట్లు, ఇంధన రంగానికి రూ.31.10 కోట్లు, ఇతర విభాగాలకు రూ.33.50కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఫ వానాకాలం సీజన్‌లో 2.42 లక్షల ఎకరాల్లో సాగు…
జిల్లాలో వానాకాలం సీజన్‌లో గత సంవత్సరం 2.42 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుత యాసంగిలో 1.80 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో వానాకాలం సీజన్‌లో వరి 1.60 లక్షల ఎకరాలు, పత్తి 49,332 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. యాసంగిలో వరి 1.78 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం యాసంగి సీజన్‌లో కొనుగోళ్లు కూడా ప్రారంభం అయ్యాయి.
పంటల రుణపరిమితి ఇలా… (రూపాయల్లో )
పంట పేరు 2023-2024 2024-2025 2025 -2026
వరి 42000 – 45000 43000 – 45000 44000 – 46000
వరి విత్తనోత్పత్తి 46000 – 50000 48000 – 50000 48000 – 50000
పత్తి 42000 – 45000 44000 – 46000 46000 – 48000
పత్తి విత్తనోత్పత్తి —— 140000 – 150000 140000 – 150000
జొన్న 17000 – 19000 18000 – 20000 19000 – 21000
జొన్న విత్తనోత్పత్తి 22000 – 25000 24000 – 26000 24000 – 26000
మొక్కజొన్న 30000 – 34000 32000 – 34000 34000 – 36000
కంది 21000 – 24000 22000 – 24000 23000 – 25000
మినుములు 18000 – 21000 19000 – 21000 20000 – 22000
పెసర్లు 19000 – 22000 20000 – 22000 20000 – 22000
శెనగలు —– 24000 – 26000 25000 – 27000
సన్ ప్లవర్ 26000 – 29000 27000 – 29000 28000 – 30000
సోయాబీన్ 26000 – 28000 28000 – 30000 28000 – 30000
వేరుశెనగ 28000 – 30000 28000 – 30000 30000 – 32000
అముదం 18000 – 20000 19000 – 21000 20000 – 21000
మిర్చి 70000 – 80000 82000 – 84000 84000 – 86000
టమాట 50000 – 55000 53000 – 55000 55000 – 57000
క్యారెట్ 30000 – 32000 32000 – 34000 32000 – 34000
అయిల్ ఫాం 40000 – 42000 42000 – 44000 46000 – 48000
నిమ్మకాయ 45000 – 50000 45000 – 50000 45000 – 47000
వంకాయ 50000 – 53000 53000 – 55000 55000 – 57000
ఉల్లిగడ్డ 40000 – 45000 43000 – 45000 45000 – 47000
క్యాబేజీ 32000 – 34000 33000 – 35000 33000 – 35000
కాలీ ప్లవర్ 32000 – 34000 33000 – 35000 33000 – 35000
కొత్తిమీర 22000 – 25000 23000 – 25000 24000 – 26000
మునక్కాయలు 32000 – 35000 33000 – 35000 34000 – 36000
అల్లం ——- 65000 – 67000 69000 – 71000
మామిడి 40000 – 42000 42000 – 44000 45000 – 47000
బొప్పాయి 60000 – 65000 65000 – 67000 67000 – 69000
డ్రాగన్ ప్రూట్స్ 65000 – 75000 78000 – 80000 78000 – 80000
Updated Date – Apr 17 , 2025 | 01:09 AM