మళ్లీ 80,000 ఎగువకు సూచీ
సెన్సెక్స్ 1,006 పాయింట్లు అప్
5.27% పెరిగిన ఆర్‌ఐఎల్ షేరు
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు సోమవారం భారీగా లాభపడ్డాయి. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా గత వారాంతంలో ఏర్పడిన నష్టాలను పూర్తిగా పూడ్చుకోగలిగాయి. సెన్సెక్స్ 1,005.84 పాయింట్లు (1.27 శాతం) ఎగబాకి 80,218.37 వద్దకు చేరగా.. నిఫ్టీ 289.15 పాయింట్ల (1.20 శాతం) వృద్ధితో 24,328.50 వద్ద ముగిసింది. అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలు ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీ్‌స (ఆర్‌ఐఎల్)తో పాటు బ్యాంకింగ్, ఫార్మా, ఎనర్జీ, ఆటో రంగ షేర్లలో మదుపరులు భారీగా కొనుగోళ్లు జరపడం ఇందుకు దోహదపడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎ్‌ఫఐఐ) పెట్టుబడులు కొనసాగడమూ మార్కెట్‌కు కలిసివచ్చింది. ఈ అనూహ్య ర్యాలీలో ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.52 లక్షల కోట్లు పెరిగి రూ.426.10 లక్షల కోట్ల(5 లక్షల కోట్ల డాలర్లు)కు చేరింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 23 రాణించాయి. మార్కెట్ దిగ్గజం
ఆర్‌ఐఎల్ షేరు ఏకంగా 5.27 శాతం ఎగబాకి సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది. సన్‌ఫార్మా 3.08 శాతం లాభపడగా.. టాటా స్టీల్, ఎం అండ్ ఎం, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు 2 శాతానికి పైగా పెరిగాయి. హెచ్‌సీఎల్ టెక్, అలా్ట్రటెక్ సిమెంట్ మాత్రం ఒక శాతానికి పైగా నష్టపోయాయి.
బీఎ్‌సఈలోని మిడ్‌క్యాప్ సూచీ 1.34 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.39 శాతం వృద్ధి నమోదు చేశాయి. రంగాలవారీ సూచీల్లో ఎనర్జీ 3.02 శాతం లాభపడింది. ఆయిల్ అండ్ గ్యాస్ 2.90 శాతం పెరిగింది. క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్, మెటల్, బ్యాంకెక్స్, రియల్టీ సూచీలు 1.93 శాతం వరకు పెరిగాయి. ఐటీ, ఫోకస్డ్ ఐటీ ఇండెక్స్ మాత్రం నేలచూపులు చూశాయి.
రూ.93,000 కోట్లు పెరిగిన ఆర్‌ఐఎల్ విలువ
సెన్సెక్స్‌లో అత్యధిక వెయిటేజీ కలిగిన ఆర్‌ఐఎల్ షేరు 5 శాతానికి పైగా పుంజుకోవడంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులోనే రూ.92,629 కోట్లు పెరిగి దాదాపు రూ.18.52 లక్షల కోట్లకు చేరకుంది. 2024 జూన్ 3 తర్వాత ఆర్‌ఐఎల్ షేరుకిదే అతిపెద్ద ఒక్కరోజు లాభం. ఈ మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ మెరుగైన లాభాలు ప్రకటించడం ఇందుకు తోడ్పడింది.
ఎల్‌జీ ఇష్యూ వాయిదా
దక్షిణ కొరియా ఎలకా్ట్రనిక్స్ దిగ్గజం ఎల్‌జీ తన భారత అనుబంధ విభాగమైన ఎల్‌జీ ఇండియా ఐపీఓను వాయిదా వేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. వచ్చేనెల రెండో వారంలో ఇష్యూను ప్రారంభించాలని కంపెనీ భావించినప్పటికీ, స్టాక్ మార్కెట్లో ఒడుదుడుకుల నేపథ్యంలో కనీసం 3 నెలలు ఆగాలని నిర్ణయించుకున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి
Live In Partner: పదేళ్ల సహజీవనం.. బెడ్డు కింద ప్రియురాలి శవం..
అడిగినంత పనీర్ వేయలేదని పెళ్లి మండపంలో దారుణం..
Updated Date – Apr 29 , 2025 | 04:47 AM