‘మా ‘రాబిన్ హుడ్’ సినిమాకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. మేము సినిమాని థియేటర్స్‌లో చూసి వచ్చాం. ఆడియన్స్ అందరూ చాలా బాగా ఎంజారు చేస్తున్నారు’ అని నిర్మాత వై. రవిశంకర్ చెప్పారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. శుక్రవారం ఈ చిత్రం రిలీజై, హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ, ‘నితిన్ పెర్ఫార్మెన్స్‌తో పాటు వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ ట్రాక్‌ని హిలేరియస్‌గా ప్రేక్షకులు ఎంజారు చేస్తున్నారు. అలాగే క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్, ట్విస్ట్‌ల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. చిన్నపిల్లలు కూడా చాలా ఎంజారు చేస్తున్నారు. వార్నర్ క్యామియోకి కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ఉగాదికి చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది’ అని అన్నారు. ‘ఈ సినిమా సమ్మర్‌కి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా నిలుస్తుంది. ప్రతి షోకి కలెక్షన్స్ పెరుగుతూ వెళ్తున్నాయి. గ్రాడ్యువల్‌గా ఈ సినిమా పెరుగుతూ వెళ్తుందని గట్టిగా నమ్ముతున్నాం. డిస్ట్రిబ్యూటర్స్ అందరు కాల్ చేసి చాలా బాగుందని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు’ అని నిర్మాత వై.రవిశంకర్ తెలిపారు.

‘రాబిన్‌హుడ్’కి అద్భుతమైన స్పందన –

Written by RAJU
Published on: