రవాణా రంగాన్ని కొల్లగొట్టిన వైసీపీ | YCP looted the transportation sector

Written by RAJU

Published on:

స్థానిక డిపోలోని సమస్యలను పరిష్కరించాం

కోడుమూరు రోడ్డుకు రూ.6 కోట్ల నిధులు

ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి

రెండు బస్సులు ప్రారంభం

ఎమ్మిగనూరు, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ హయాంలో రవాణారంగాన్ని వైసీపీ నాయకులు నాశనం చే సి కొల్లగొ ట్టారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో రెండు కొత్త బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల కాలంలో కొత్త బస్సుల కత దేవుడెరుగుకాని, ఆర్టీిసి డిపోలో ఇంత చెత్త ఎత్తిపోసిన పాపాన పోలేదన్నారు. ఆర్టీసీని నిర్వీర ్యం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ్క ఎమ్మిగనూరు డిపోకు మాత్రమే 23 కొత్త బస్సులు తీసుకువచ్చినట్లు తెలిపారు. బెంగళూరు, హైదరాబాదు, అరుణాచలం, తిరుపతితో పాటు పలు సుదూరు ప్రాంతాలకు, అన్ని గ్రామాలకు పల్లె వెలుగు బస్సు సౌక ర్యాలను ఏర్పాటు చేశారన్నారు. స్థానిక డిపోలో ఉన్న సమస్యలన్నింటిని పరిష్కరించడంతో పాటు మరికొన్ని కొత్తబస్సులను కూడా తీసుకువస్తా మన్నారు. ఎమ్మిగనూరు నుంచి కోడుమూరు రోడ్డు గుంతల మయంగా ఉండడంతో బస్సులు గంటల తరబడి ప్రయాణం సాగించాల్సి ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్డు మరమ్మతులు చేసి ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా చేసిందన్నారు. తాజాగా కోడుమూరు రోడ్డుకు రూ.6కోట్లతో కొత్త రోడ్డు ఏర్పాటుకు నిధులు మం జూరు చేయించామన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌ మద్దిలేటి నాయుడు, మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి, నాయకులు మిఠాయి నరసింహులు, రాందాసుగౌడు, ఆర్టీసి అల్తాఫ్‌, రంగన్న, ఉరుకుందు, మహేష్‌, రంగస్వామిగౌడు, రాజు, గుల్లా సలాం, బుగెడె నాగరాజు, కటారి రాజేంద్ర, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date – Apr 24 , 2025 | 01:33 AM

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights