నవతెలంగాణ-భిక్కనూర్ :తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ బిఆర్ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 27వ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో నిర్వహించే పార్టీ రజితోత్సవ సభకు మండలం నుండి వేలాదిగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో బహిరంగ సభ సన్నాహక సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నమ్మి అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్లాలని, రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అత్తిలి శ్రీనివాస్, సీనియర్ నాయకులు రామచంద్రం, సాయి రెడ్డి, భూమ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వేణు, వెంకట్ రెడ్డి, నర్సారెడ్డి, రవీందర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.