యూనిక్‌ లవ్‌స్టోరీ..

Written by RAJU

Published on:

యూనిక్‌ లవ్‌స్టోరీ..’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాతో అలరించిన హీరో ప్రదీప్‌ మాచిరాజు తన సెకండ్‌ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ యూనిక్‌ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను దర్శక ద్వయం నితిన్‌, భరత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్‌ అండ్‌ మంకీస్‌ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. మేకర్స్‌ ఈ చిత్ర విడుదల తేదీని అనౌన్స్‌ చేశారు. ఈ సినిమా వేసవిలో బిగ్గెస్ట్‌ ఎట్రాక్షన్‌లో ఒకటిగా ఏప్రిల్‌ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ‘ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, సాంగ్స్‌కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో సినిమాపై మంచి బజ్‌ నెలకొంది. యూనిక్‌ పాయింట్‌తో రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది. అలాగే ఇందులో ప్రదీప్‌, దీపికాల పాత్రలు మనల్ని సర్‌ప్రైజ్‌ చేస్తాయి’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, సత్య, గెటప్‌ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్‌, డీఓపీ: ఎం.ఎన్‌. బాలరెడ్డి, ఎడిటర్‌: కోదాటి పవనకల్యాణ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఆశిస్తేజ పులాల, కథ – మాటలు: సందీప్‌ బొల్లా.

Subscribe for notification