యూనిక్‌ కంటెంట్‌ ఉన్న క్రైమ్‌-కామెడీ

Written by RAJU

Published on:

యూనిక్‌ కంటెంట్‌ ఉన్న క్రైమ్‌-కామెడీడైరెక్టర్‌ త్రినాథరావు నక్కిన తన అప్‌ కమింగ్‌ క్రైమ్‌-కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’తో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. హీరోగా ఇంద్రరామ్‌ను, దర్శకుడిగా నిఖిల్‌ గొల్లమారిని ఈ మూవీతో పరిచయం చేస్తున్నారు. నక్కిన నెరేటివ్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ మూవీకి వి.చూడమణి సహ నిర్మాత. ఈ సినిమా ఈనెల 25న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా హీరో ఇంద్ర రామ్‌ మీడియాతో ముచ్చటించారు.
మాది విజయవాడ. అక్కడే చదువుకున్నాను. ఢిల్లీ యూనివర్శిటీలో ఇంజనీరింగ్‌ చేశాను. చదువుతో పాటు జిమ్నాస్టిక్స్‌, డ్యాన్స్‌ నేర్చుకున్నాను. సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అలాగే నాకు రామ్‌ గోపాల్‌ వర్మ ఇష్టం. సినిమా అవకాశం కోసం ఆయన దగ్గరికి వెళ్లాను. ‘వంగవీటి’ సినిమాలో ఓ క్యారెక్టర్‌ ఇచ్చారు. దర్శకుడు అజరు భూపతితో నాకు జర్నీ ఉంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ నేను చేయల్సిన సినిమా. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. నక్కిన త్రినాథరావు ప్రొడక్షన్‌ హౌస్‌ పెడుతున్నారని తెలిసి ఆయన్ని కలిశాను. అలా ఈ జర్నీ మొదలైంది. ఈ సినిమాలో కథే మెయిన్‌ హీరో. త్రినాథ్‌ చాలా ప్యాషన్‌తో ఈ సినిమాని నిర్మించారు.
కథా రచయిత కార్తిక్‌ వాళ్ళ ఫాదర్‌ ఐజిగా పని చేశారు. ఇలాంటి కేసుని ఆయన టేకాఫ్‌ చేశారు. ఒక వీధిలో బ్యాంక్‌ ఉంటే, మరో వీధిలో రూమ్‌ని తీసుకుని, అక్కడ నుంచి టన్నెల్‌ తవ్వి బ్యాంక్‌లోకి చొరబడ్డ సంఘటన జరిగింది. దానికి ఫిక్షన్‌ జోడించి ఈ సినిమాని చేశాం.
ఇదొక డిఫరెంట్‌ జోనర్‌ సినిమా. అవుట్‌ పుట్‌ అద్భుతంగా వచ్చింది. ఇందులో రాజీవ్‌ కనకాల పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. హీరోయిన్‌ పాయల్‌ రాధకష్ణ పెర్ఫార్మెన్స్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. డైరెక్టర్‌ నిఖిల్‌ చాలా క్లియర్‌ విజన్‌ ఉన్న డైరెక్టర్‌. ప్రతీదీ పర్ఫెక్ట్‌గా రాసుకున్నారు. నేను హీరోగానే కాకుండా కీ రోల్స్‌ చేయడానికి కూడా సిద్ధం. మంచి యాక్టర్‌ అనిపించుకోవడమే నా లక్ష్యం.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights