యూత్‌కు బిగ్ అలర్ట్.. ఇలాంటి తప్పులు చేస్తే షుగర్ పక్కా అంట.. కంట్రోల్ చేసేందుకు బెస్ట్ టిప్స్ ఇవే..

Written by RAJU

Published on:

యూత్‌కు బిగ్ అలర్ట్.. ఇలాంటి తప్పులు చేస్తే షుగర్ పక్కా అంట.. కంట్రోల్ చేసేందుకు బెస్ట్ టిప్స్ ఇవే..

భారతదేశంలో డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో 10 కోట్లకు పైగా మధుమేహం కేసులు ఉన్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. డయాబెటిస్ వ్యాధి రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల వస్తుంది. ఇప్పుడు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సులో కూడా చక్కెర స్థాయి పెరుగుతోంది. టైప్ 1 డయాబెటిస్ లేని వ్యక్తులకు కూడా ఇలా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. దీని అర్థం మధుమేహం వ్యాధి.. వారి తల్లిదండ్రుల నుంచి వారికి బదిలీ కాలేదని స్పష్టం అవుతోంది.. కానీ, యువతలో చక్కెర స్థాయి పెరగడం ఆందోళన కలిగించే విషయమని.. డయాబెటిస్ పై అవగాహనతో ఉండాలని.. జీవనశైలిలో, ఆహారంలో మార్పులు అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

చిన్న వయసులోనే చక్కెర స్థాయి ఎందుకు పెరుగుతుంది..? దానిని ఎలా నియంత్రించవచ్చు? నిపుణులు ఏం చెబుతున్నారు.. ఈ వివరాలను తెలుసుకోండి..

ఇలాంటి తప్పులు చేస్తే..

30 నుండి 35 సంవత్సరాల వయస్సులో చక్కెర స్థాయిలు పెరగడానికి ప్రధాన కారణం చెడు ఆహారపు అలవాట్లే అని ఢిల్లీలోని GTB హాస్పిటల్‌లోని మెడిసిన్ విభాగానికి చెందిన డాక్టర్ అజిత్ కుమార్ అంటున్నారు. నేటి ప్రజల ఆహారంలో ఎక్కువ చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఉన్నాయి. ఆహారంలో స్వీట్ల పరిమాణం కూడా పెరిగింది.. ప్రజలు మునుపటి కంటే ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు. ఈ రకమైన ఆహారంలో అధిక GI సూచిక ఉంటుంది.. ఇది శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.

మానసిక ఒత్తిడి కూడా ఒక పెద్ద కారణం

పని ఒత్తిడి, గృహ ఉద్రిక్తతలు, సోషల్ మీడియా ప్రభావం కారణంగా ప్రజల మానసిక ఆరోగ్యం క్షీణిస్తోందని డాక్టర్ కుమార్ అంటున్నారు. చిన్న వయసులోనే చక్కెర స్థాయిలు పెరగడానికి మానసిక ఒత్తిడి కూడా ఒక ప్రధాన కారణం. మానసిక ఒత్తిడి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది చక్కెర స్థాయిని నేరుగా ప్రభావితం చేస్తుంది.

ఇప్పుడు ప్రజల జీవనశైలి క్షీణించిందని, ప్రజలు గంటల తరబడి ఫోన్‌లో గడుపుతున్నారని.. అంతేకాకుండా తక్కువ వ్యాయామం చేస్తున్నారని డాక్టర్ కుమార్ వివరించారు..

వ్యాయామం చేయకపోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది. నేటి కాలంలో, ఇన్సులిన్ నిరోధకత చిన్న వయస్సులోనే సంభవిస్తుందని తెలిపారు.. దీని వల్ల శరీరంలో చక్కెర కూడా పెరుగుతుంది. చాలా సందర్భాలలో ప్రజలకు దాని ప్రారంభ లక్షణాల గురించి తెలియదు. డయాబెటిస్ వచ్చినప్పుడు, శరీరంలో ఆ వ్యాధి అభివృద్ధి చెందిందని తెలుస్తుందని.. అప్పటివరకు నెగ్లెట్ చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స పొందడం మంచిదని సూచిస్తున్నారు.

చక్కెర స్థాయిని ఎలా నియంత్రించాలి

రోజూ కనీసం అరగంట వ్యాయామం చేయండి.

ఎక్కువ స్వీట్లు తినకండి – చక్కెర పదార్థాలకు దూరంగా ఉండండి..

మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి.. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు – పండ్లను చేర్చుకోండి.

మానసిక ఒత్తిడికి గురికావద్దు.. యోగా లాంటివి చేయండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification