మ్యూజిక్‌ ప్రమోషన్స్‌లో ‘కుబేర’

Written by RAJU

Published on:

మ్యూజిక్‌ ప్రమోషన్స్‌లో ‘కుబేర’ధనుష్‌, నాగార్జున అక్కినేని, రష్మిక మందన్న, జిమ్‌ సర్భ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. ఈ చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ని ఈనెల 20న విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.
అలాగే ఈ పాట తాలూకా మరిన్ని వివరాలతో ప్రోమోను మంగళవారం రిలీజ్‌ చేశారు.
జాతీయ అవార్డు గ్రహీతలు శేఖర్‌కమ్ముల, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ మొదటిసారి కలిసి చేస్తున్న చిత్రమిది. మరో ఎగ్జైటింగ్‌ విషయం ఏమిటంటే, మరో జాతీయ అవార్డు గ్రహీత ధనుష్‌ కూడా ఈ చిత్రంలో నటించడం మరో విశేషం. అలాగే ఈ ముగ్గురూ కలిసి మాస్‌ డ్యాన్స్‌ నెంబర్‌ ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి.
విడుదల చేసిన పోస్టర్‌లో ధనుష్‌ డ్యాన్స్‌, విజిల్స్‌తో వేడుక వాతావరణం ఉంది. బ్యాక్‌డ్రాప్‌లో డ్యాన్స్‌ చేస్తూ పెద్ద సంఖ్యలో జనం పండుగ మూడ్‌లో కనిపించారు. ఈ పాట ఫుట్‌ ట్యాపింగ్‌ మ్యూజిక్‌తో కూడిన మాస్‌ సాంగ్‌ అని హామీ ఇచ్చింది.
ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం జూన్‌ 20న విడుదల కానుంది.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights