మోదీ వస్తున్నారు.. రాజధానిని శుభ్రం చేయండి! అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలు

Written by RAJU

Published on:

మోదీ అమెరికా పర్యటనకు వస్తున్నారని, ఆయనతో పాటు మరికొంతమంది దేశాధ్యక్షులు కూడా వస్తారని, వాళ్లు వచ్చిన సమయంలో వాషింగ్టన్‌ డీసీ సుందరంగా మారిపోవాలని, నగరంలో టెంట్లు, గోడలపై గ్రాఫిటీలు, రోడ్లపై గుంతలు కనిపించడానికి వీలు లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాషింగ్టన్‌ డీసీలో రోడ్డు పక్కల టెంట్లు, గోడలపై పిచ్చి పిచ్చి గ్రాఫిటీలు మోదీ తదితరులు చూడాలని నేను అనుకోవడం లేదంటూ ట్రంప్‌ పేర్కొన్నారు. వాషింగ్టన్ డీసీని శుభ్రం చేయాలని అనుకుంటున్నామని ట్రంప్‌ పేర్కొన్నారు.

అలాగే నేర రహిత నగరంగా వాషింగ్టన్‌ డీసీని చేయాలని అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చే వారెవరూ తాము భద్రంగా ఉంటామనే భావనను కలిగి ఉండాలని, ఇక్కడ ఎలాంటి క్రైమ్‌లు జరగకుండా చూస్తామని అన్నారు. అందుకోసమే నగరాన్ని శుభ్రం చేస్తున్నాం. ఇప్పటికే టెంట్లు తొలగించాం. అలాగే గ్రాఫిటీలను కూడా తొలగిస్తాం. అందుకు మాకు పెద్దగా సమయం పట్టదు అంటూ ట్రంప్‌ వెల్లడించారు. కాగా, ప్రధాని మోదీ ఇటీవలె అమెరికాలో పర్యటించి, ప్రెసిడెంట్‌ ట్రంప్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ పలు దేశాల అధినేతలో వైట్‌ హైజ్‌లో వరుసగా సమావేశం అవుతున్నారు.

ఇప్పటికే మోదీతో పాటు ఉక్రెయిన్‌, యూకే, జోర్దాన్‌ దేశాధ్యక్షులతో కూడా ట్రంప్ భేటీ అయ్యారు. ఇక మరోసారి ప్రధాని మోదీతో పాటు, యూకే ప్రధానితో కూడా ట్రంప్ భేటీ కానున్నారు. ఈ క్రమంలోనే వారి రాక సమయంలో వాషింగ్టన్‌ డీసీ క్లీన్‌గా ఉండాలని ట్రంప్‌ భావిస్తున్నారు. ఫిబ్రవరి 13న ట్రంప్‌తో ద్వైపాక్షిక సమావేశం కోసం ప్రధాని మోదీ వైట్‌హౌస్‌ను సందర్శించారు. ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల్లోనే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, జపాన్ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా, జోర్డాన్ రాజు అబ్దుల్లా-2, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్‌తో సమావేశం అయ్యారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Subscribe for notification