మేడే స్ఫూర్తితో కార్మికుల పర్మినెంట్ కోసం కొట్లాడుదాం.!

Written by RAJU

Published on:

నవతెలంగాణ – జక్రాన్ పల్లి : మేడే స్పూర్తితో 139 స్ఫూర్తితో సఫాయి కార్మికుల పర్మినెంట్ కోసం కోట్లడుదామని జక్రాన్ పల్లి గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సోప్పరి గంగాధర్ కార్మికులకు పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా జక్రాన్పల్లి మండల కేంద్రంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా గంగాధర్ మాట్లాడుతూ..  చికాగో నగరంలో 8 గంటలకు కోసం కార్మికులు పోరాడి, ప్రాణాలర్పించిన చరిత్ర కార్మికుల ఉందని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ సపాయి కార్మికులను ఢిల్లీకి పిలిపించుకొని శాలువా కప్పి సన్మానం చేసిందని, కానీ ఎనిమిది గంటల పని విధానం స్థానంలో 12 గంటల పని తేవడం విచారకరమని ఆయన అన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని,  కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ చట్టాలను అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  సీఎం రేవంత్ రెడ్డి సఫాయి కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు నాయకులు శేఖర్, రాజన్న, సాయన్న, రేణుక, గంగు, సాయమ్మ, తదితరులు పాల్గొన్నారు. 

– Advertisement –

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights