ABN
, Publish Date – Mar 26 , 2025 | 12:37 AM
Another child on the brink of death గిరిశిఖర పంచాయతీ దారపర్తిలో శిశుమరణాలు ఆగడం లేదు.. రెండునెలల క్రితం జనవరి 26న అనారోగ్యంతో రెండు నెలల శిశువు జన్ని విజయ్ మరణం మరువకముందే ఇదే గ్రామానికి చెందిన కురిడిబోయిన గంగులు, సీతమ్మల ఐదునెలల కుమారుడు(పేరు పెట్టలేదు) అనారోగ్యంతో మంగళవారం ఉదయం విజయనగరం ఘోషా ఆసుపత్రిలో ప్రాణాలొదిలాడు.

మృతి శిశువుతో తన గ్రామానికి బయలుదేరిన తల్లి
మృత్యుతీరానికి మరో చిన్నారి
రెండు నెలల కాలంలో గిరిశిఖర గ్రామంలో ఇద్దరి మృతి
వైద్యశాఖ నిర్లక్ష్యమే కారణమంటున్న గిరిజన సంఘం
శృంగవరపుకోట రూరల్, మార్చి 25(ఆంధ్రజ్యోతి): గిరిశిఖర పంచాయతీ దారపర్తిలో శిశుమరణాలు ఆగడం లేదు.. రెండునెలల క్రితం జనవరి 26న అనారోగ్యంతో రెండు నెలల శిశువు జన్ని విజయ్ మరణం మరువకముందే ఇదే గ్రామానికి చెందిన కురిడిబోయిన గంగులు, సీతమ్మల ఐదునెలల కుమారుడు(పేరు పెట్టలేదు) అనారోగ్యంతో మంగళవారం ఉదయం విజయనగరం ఘోషా ఆసుపత్రిలో ప్రాణాలొదిలాడు. ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రికి సోమవారం తీసుకెళ్లారని, వారు నిర్లక్ష్యంతో సరైన వైద్యం చేయకుండా వదిలేశారని, పరిస్థితి విషమించాక విజయనగరం రిఫర్ చేశారని శిశువు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
దారపర్తి గ్రామానికి చెందిన కురిడిబోయిన గంగులు, సీతమ్మల ఐదు నెలల కుమారుడు మూడు రోజుల కిందట అనారోగ్యం బారిన పడ్డాడు. ఊపిరి సరిగా అందక ఇబ్బంది పడుతుండడాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఆదివారం రాత్రి 11గంటల సమయంలో ఎస్.కోట సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ఆ సమయంలో బాలుడికి ప్రాథమిక చికిత్స అందించారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బాలుడ్ని పర్యవేక్షిస్తూ వైద్యం అందించారు. అయినప్పటికీ సాయంత్రానికి యూరిన్ నిలిచిపోయింది. దీంతో అక్కడి వైద్యులు విజయనగరం రిఫర్ చేశారు. ఆ వెంటనే విజయనగరం ఘోష ఆస్పత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ఊపిరితిత్తుల్లో సమస్య తగ్గలేదు. పరిస్థితి మరింత విషమించడంతో మంగళవారం ఉదయం బాలుడు మృతిచెందాడు.
Updated Date – Mar 26 , 2025 | 12:37 AM