నవతెలంగాణ – తాడ్వాయి
ఇటీవల అనారోగ్య కారణాలతో చల్పాక గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన తాటి సమ్మయ్య అనే వ్యక్తి మృతి చెందగా మృతుడి కుటుంబానికి, పూర్వ విద్యార్థులు 10వ తరగతి కలిసి చదువుకున్న స్నేహితులు అందరూ కలిసి పదివేల రూపాయల ఆర్థిక సహాయం, నిత్యవసర సరుకులు అందజేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడికి భార్య, నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వారి స్నేహితులు పొడెం సమ్మయ్య, పోడెం ప్రసాద్, చింత లక్ష్మయ్య, ఎస్. పోశయ్య, పి నాగరాజు, తాటి నరేష్, బంధువులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.