
నవతెలంగాణ-మల్హర్ రావు : రంజాన్ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు మంథని నియోజకవర్గ, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలతోపాటు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరి,సోదరులకు సోమవారం రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు రంజాన్ పవిత్రమైన నెలగా, త్యాగం, భక్తి, సహనం, మానవతా విలువల ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఉపవాస దీక్ష, ప్రార్థనలు, దానం వంటి ఆచారాలు సామాజిక సమగ్రతను పెంపొందిస్తాయని, అందరూ కలిసికట్టుగా సమాజంలో శాంతి, ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.రంజాన్ పండుగను ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని వారు సూచించారు.అల్లా యావత్ తెలంగాణ ప్రజలను చల్లగా చూడాలని ఆకాంక్షించారు.