ముయ్యాలమ్మ తల్లి రహదారిని ప్రారంభించిన మంత్రి సీతక్క  –

Written by RAJU

Published on:

ముయ్యాలమ్మ తల్లి రహదారిని ప్రారంభించిన మంత్రి సీతక్క  –నవతెలంగాణ – గోవిందరావుపేట 

మండలంలోని పసర గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో ముయ్యాలమ్మతల్లి గుడి రహదారి పనుల పూజా కార్యక్రమాన్ని మంగళవారం  మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మండలంలోని ప్రతి మానవుల గ్రామంలోనూ సందు గొందు రహదారులను సైతం సిసి రహదారులుగా మార్చి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలతో గ్రామంలో సిసి రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. రహదారి పనుల ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు గొంది కిరణ్ మాట్లాడుతూ 20 లక్షల వ్యయంతో 267 మీటర్లు సిసి రహదారు పనులను పాత బొడ్రాయి నుండి ఉయ్యాలమ్మ తల్లి గుడి వరకు మంజూరి ఇచ్చిన సందర్భంగా మంత్రి సీతక్కకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఈ ప్రాంత వాసులకు ఈ రహదారి వల్ల ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. నాణ్యతలో ఎక్కడ రాజీ పడకుండా రహదారి నిర్మాణం చేస్తున్నామని కిరణ్ అన్నారు. గ్రామంలో పెండింగ్లో ఉన్న మరిన్ని రహదారుల సీసీ నిర్మాణాల కొరకు మంత్రికి విన్నవించడం జరిగిందని, సజావుగా స్పందించి హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలడుగు వెంకట కష్ణ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చింతా క్రాంతి, ఐ ఎన్ టి యు సి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బద్దంలిగారెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొల్లు శ్రీనివాసరెడ్డి పలువురు జిల్లా నాయకులు మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమీప ప్రజలు అభిమానులు పాల్గొన్నారు.

Subscribe for notification