– సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం :సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
– రామన్నపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-రామన్నపేట
రామన్నపేట మండల సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సీపీఐ(ఎం) పోరాటం ఆపదని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కమిటీ ఆధ్వర్యం లో మండల సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యలు పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ ఆరు రోజుల పాటు 24గ్రామాల్లో నిర్వహించిన ప్రజా చైతన్య పాదయాత్ర శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ లాల్ బహుదూర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ.. రామన్నపేట పాత నియోజక వర్గంగా, పాత తాలూకాగా విరాజిల్లి ఇప్పుడు మండలంగా మాత్రమే ఉండి అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పాటయ్యే నియోజకవర్గాల పునర్‌విభజనలో రామన్నపేటను నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వాస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మారుస్తామని దశాబ్ద కాలంగా ప్రభుత్వం చెబుతూ కాలమెళ్లదీస్తోందని విమర్శించారు. రెండు దశాబ్దాలు గడుస్తున్నా పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాలువలు పూర్తి కావడం లేదని, కాలువలను పూర్తిచేసి రైతుల భూములకు సాగు నీరందించాలన్నారు. ఇప్పటికీ మండలంలో ఏ గ్రామానికీ కనీసం బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమ కార్యాచరణ కొన సాగుతూనే ఉంటుం దని చెప్పారు. రామన్నపేట శాసనసభ నియోజక వర్గం కావాలంటే పోరాటం చేయా ల్సిం దేనన్నారు. ఈ కార్య క్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్‌రెడ్డి, పాదయాత్ర సారథి జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డు పల్లి వెంకటేశం, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోయిని ఆనంద్, కందుల హనుమంతు పాల్గొన్నారు.