ముగిసిన ఆస్ట్రియా పర్యటన.. టీవీ9 చొరవపై ప్రశంసలు కురిపించిన క్రీడా మంత్రి

Written by RAJU

Published on:


Indian Tigers and Tigresses: ఫుట్‌బాల్ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ టీవీ9 ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్సెస్ తరపున ఎన్నికైన యువ ఆటగాళ్లు.. ఆస్ట్రియాలో తమ శిక్షణ పూర్తి చేసుకుని సోమవారం భారత్‌కు తిరిగి వచ్చారు. జర్మన్ టాప్-ఫ్లైట్ క్లబ్ VFB స్టట్‌గార్ట్‌ను సందర్శించి ఈ పర్యటనకు ముగింపు పలికారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ టాలెంట్ హంట్‌లో ఎంపికైన 28 మంది యువ ఆటగాళ్లు.. ఆస్ట్రియాలోని గ్ముండెన్‌లోని యూరోపియన్ కోచ్‌లతో కీలక శిక్షణ పొంది తమ ప్రతిభకు మరింత సాన పట్టారు.

కాగా, జర్మనీలోని స్టట్‌గార్ట్‌లోని MHP అరీనాలో VFB స్టట్‌గార్ట్ అండర్-12 జట్టుతో 2 రోజుల శిక్షణా సెషన్‌లో ఎన్నో మెలుకువలు నేర్చుకున్నారు.

VfB స్టట్‌గార్ట్‌లో శిక్షణ..

TV9 నెట్‌వర్క్ చొరవతో జర్మన్ క్లబ్ VfB స్టట్‌గార్ట్ కోచ్ ఎంపిక చేసిన నలుగురు పిల్లలు – అక్షిత స్వామి, జప్లీన్ కుమార్, మానవ్ కిరణ్ పటేల్, అర్జున్ సింగ్‌లు ప్రపంచ స్థాయి కోచ్‌ల పర్యవేక్షణలో యూరోపియన్ పిల్లలతో జీవితకాలం శిక్షణ పొందే అవకాశాన్ని పొందారు. ఈ క్రమంలో భారత ఆటగాళ్ళు ఒత్తిడిలో ఎలా ఆడాలో నేర్చుకున్నారు.

అలాగే, జర్మనీ మహిళా ఫుట్‌బాల్ జట్టు డిఫెండర్ లియోనీ మేయర్‌ను భారీ MHP అరీనాలో కలిసే అవకాశం పిల్లలకు లభించింది. ఆటోగ్రాఫ్ సెషన్‌లో వీరంతా పాల్గొన్నారు. ఆ తర్వాత అంతా కలిసి లంచ్ చేశారు.

Indian Tigers And Tigresses (1)

చారిత్రాత్మక యూరోపియన్ పర్యటన తర్వాత, యువ ఛాంపియన్లు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో వీరంతా క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిశారు. కేంద్ర మంత్రి టీవీ9 ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ ప్రయత్నాన్ని ప్రశంసించారు. 2036 ఒలింపిక్స్, FIFA ప్రపంచ కప్‌ను అర్హత సాధించేందుకు కృషి చేయాలంటూ పిల్లలకు సూచించారు.

దేశ వ్యాప్తంగా జరిగిన ఈ ట్యాలెంట్ హంట్‌లో 50,000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇందులో 10,000 మందిని ప్రాంతీయ ట్రయల్స్‌లో ఎంపిక చేశారు. అయితే, ఆస్ట్రియా, జర్మనీలలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి కేవలం 28 మంది ఎంపికయ్యారు.

మార్చి 28న న్యూఢిల్లీలో జరిగిన వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) సమ్మిట్‌లో పాల్గొన్న పీఎం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ న్యూస్9 “ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్స్” ప్రయత్నంపై ప్రశంసలు కురిపంచారు. అలాగే యువ ఛాంపియన్‌లకు పలు సూచనలు చేసి చారిత్రాత్మక వీడ్కోలు పలికారు.

News9 Indian Tigers & Tigresses Train with Bundesliga Giants VfB Stuttgart | News9

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification
Verified by MonsterInsights