
చాలా మందికి ముఖం మీద చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. చనిపోయిన చర్మ కణాలు, దుమ్ము ఆ రంధ్రాలలో చిక్కుకున్నప్పుడు ముఖంపై ఇలా ఏర్పాడుతుంది. ముక్కు చుట్టూ ఉన్న సేబాషియస్ గ్రంథుల పెరుగుదల వల్ల కూడా ఇలా అవుతుంది. అయితే, ముక్కు మీద, చుట్టూ పేరుకుపోయిన వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్‌ని తొలగించుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, వాటితో పెద్దగా ప్రయోజనం ఉండకపోగా, సైడ్‌ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తుంటాయి. కానీ, కొన్ని ఇంటి నివారణలను ఉపయోగించి వైట్ హెడ్స్ ను పూర్తిగా తొలగించవచ్చు అంటున్నారు నిపుణులు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
ఇందుకోసం కావలసిన పదార్థాలు..1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. బేకింగ్ సోడా, తేనె, నిమ్మరసం కలిపి చిక్కటి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దాంతో ముక్కు చుట్టూ రాయండి. తర్వాత సున్నితంగా మసాజ్ చేసి 10 నుండి 15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేస్తే చాలు.
ఇక్కడ మనం ఉపయోగించే బేకింగ్ సోడా ఒక ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. తేనె సహజ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. మొటిమలను తగ్గిస్తుంది. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మంపై అదనపు నూనెను తగ్గించడంలో సహాయపడుతుంది. తెల్లమచ్చలను తగ్గిస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..