
ప్రస్తుత కాలంలో నమ్మకమైన మిత్రులు తగ్గిపోతున్నారు. చాలా మందికి శత్రువులు ఎక్కువవుతున్నారు. ఎవ్వరినైనా అడిగితే ఆ వ్యక్తి నన్ను అసూయతో చూస్తున్నాడు అని అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మహాభారతంలో చెప్పిన విదుర నీతి మనకు చక్కటి మార్గాన్ని చూపుతుంది. శత్రువులను ఎలా గుర్తించాలి..? ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు ఇందులో స్పష్టంగా ఉన్నాయి.
విదురుడు చెప్పినట్టు శత్రువు ఎంత బలహీనంగా కనిపించినా అతనిని నిర్లక్ష్యం చేయకూడదు. అతని నిజస్వరూపం ఒక సమయంలో బయటపడుతుంది. అందుకే అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
శత్రువు ఎప్పుడూ తన శత్రుత్వాన్ని బయటపడేయడు. నెమ్మదిగా తన పథకాలను అమలు చేస్తాడు. అతని ప్రతి కదలికను గమనించాలి. అంతే కాదు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.
శత్రువు మీద నమ్మకం పెట్టుకోవడం సరికాదు. అతని ప్రతి మాట, చర్య మీద సందేహం ఉంచాలి. అతని ఆలోచనలు ఎటు పోతున్నాయో తెలుసుకోవాలి.
శత్రువు ధైర్యంగా ఉంటే అతను ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అతనికి భయం కలిగితే దాడి చేసే అవకాశం తగ్గుతుంది. అందుకే అతని ధైర్యాన్ని తగ్గించే విధంగా వ్యవహరించాలి.
మీరు బలహీనంగా ఉంటే శత్రువు దాడికి వస్తాడు. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ గట్టిగా ఉంచాలి. మీరు బలహీనంగా ఉన్నట్టు అతనికి అనిపించకూడదు.
శత్రువు గురించి ఎంత సమాచారం మీ దగ్గర ఉంటే అంత మంచిది. అతని ప్రణాళికలు ఏవో ముందుగానే అర్థం చేసుకోవచ్చు. ఆ సమాచారం వల్ల మీరు ముందస్తుగా జాగ్రత్తపడవచ్చు.
మీరు ఏం ఆలోచిస్తున్నారు..? ఏం చేయబోతున్నారు అనే విషయాలు బయటకు చెప్పకూడదు. శత్రువు అవి విని.. మీకు అడ్డంకులు సృష్టించగలడు. మీ ప్రణాళికలు గోప్యంగా ఉంచాలి.
శత్రువు ముందు ఓపికతో, శాంతంగా ఉండాలి. కానీ లోపల తెలివిగా వ్యవహరించాలి. అతనితో ప్రత్యక్షంగా తగాదా పెట్టుకోవడం కన్నా.. మీ మేధస్సుతో అతనిని ఓడించాలి.
విదురుడు చెప్పిన ఈ నీతులు మన జీవితంలో శత్రువులను గుర్తించడంలో, అడ్డుకునే మార్గంలో ఎంతో ఉపయోగపడతాయి. మన ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేస్తాయి. నిజమైన స్నేహితులు ఎవరూ అనేది తెలుసుకోవడానికి కూడా ఇది దోహదపడుతుంది.