మార్నింగ్ ఏ టైమ్ కి వాకింగ్ చేస్తే బెస్ట్..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

Written by RAJU

Published on:

మార్నింగ్ ఏ టైమ్ కి వాకింగ్ చేస్తే బెస్ట్..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

ఉదయాన్నే నడవడం ఒక్కసారి అలవాటు చేసుకుంటే అది మీ ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నడక అనేది చాలా సింపుల్ ఫిజికల్ యాక్టివిటీ అయినా దాని వల్ల కలిగే లాభాలు మాత్రం అంత అసాధారణంగా ఉంటాయి. ప్రతి రోజూ కొంత సమయం వాకింగ్‌కి కేటాయించడం వల్ల శరీరం ఆరోగ్యంగా, మనసు ఉల్లాసంగా ఉంటుంది.

విదేశీ ఆరోగ్య పరిశోధనలు చెప్పిన ప్రకారం వారానికి కనీసం 5 రోజులు, రోజూ 20 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల రోజంతా ఎనర్జీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది వయసుతో సంబంధం లేకుండా ఈ అలవాటు ప్రతి ఒక్కరికీ ఎంతో మేలు చేస్తుంది.

డయాబెటిస్ ఉన్న వారు ఉదయాన్నే నడవడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇది ఇన్‌సులిన్‌కు శరీరం స్పందించే విధానాన్ని మెరుగుపరిచి.. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది

రోజూ కనీసం 25 నిమిషాల పాటు నడవడం వల్ల బ్రెయిన్‌లో ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది. దీనివల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది, మానసిక స్పష్టత పెరుగుతుంది.

వాకింగ్ చేయడం వల్ల హార్ట్‌బీట్ రెగ్యూలర్‌గా మారుతుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది. దీని వలన హృదయ సంబంధిత సమస్యల రిస్క్ తగ్గుతుంది.

ఉదయం శుద్ధమైన గాలిలో నడవడం వల్ల శరీరానికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది. దీనివల్ల ఇమ్యూనిటీ బలోపేతం అవుతుంది.

ఉదయం సూర్యోదయ సమయంలో వాకింగ్ చేయడం వల్ల సహజంగా విటమిన్ డి లభిస్తుంది. ఇది ఎముకల బలానికి, మూడ్ మెరుగుదలకు కీలకంగా పనిచేస్తుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం 6:30 నుంచి 8:00 గంటల మధ్య వాకింగ్ చేయడం ఉత్తమం. ఈ టైమ్‌లో వాతావరణం చల్లగా ఉంటుంది. సూర్యరశ్మి మృదువుగా ఉండి విటమిన్ డి‌ను శరీరం సులభంగా గ్రహించగలదు. పైగా ఈ సమయంలో గాలి కూడా చాలా తాజాగా ఉంటుంది.

చలికాలంలో వాకింగ్‌కు వెళ్లేటప్పుడు గుండె సంబంధిత సమస్యలున్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. హై బిపి ఉన్నవారు ఉదయాన్నే వాకింగ్ చేయడం కన్నా రోజులో కాస్త ఆలస్యంగా చేయడం మంచిది. అలాగే వాకింగ్‌కి కాఫీ తాగాక వెళ్లకూడదు. ఖాళీ కడుపుతో లేదా తేలికపాటి నీటితో ఉండటం ఉత్తమం.

ఉదయపు వాకింగ్ అనేది ఆరోగ్యానికి గోల్డెన్ హ్యాబిట్ అని చెప్పొచ్చు. ఇది కేవలం శరీరానికి కాకుండా మనసుకు కూడా విశ్రాంతిని ఇస్తుంది. ప్రతి రోజు కాస్త సమయం కేటాయించి వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చు. అలాంటి శక్తిని మీ జీవితంలో తీసుకురావాలంటే ఈ రోజు నుంచే మొదలుపెట్టండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights