
అలాంటి మారేడు దళాలే కాదు.. మారేడుకాయలు కూడా ఎంతో విశిష్టమైనవి. శివుని పూజకే కాదు.. మనిషి ఆరోగ్యానికి మారేడు ఫలం సంజీవనిలా పనిచేస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఇబ్బందిపెట్టే పలురకాల సమస్యల్ని నివారించడంలో దీన్ని మించింది లేదని చెబుతారు. అందుకే ఈ సమయంలో ఇతర జ్యూస్‌లతో పాటు మారేడుపండు రసం తాగేవారి సంఖ్య పెరుగుతోంది. వేసవికాలంలో కమ్మని కొబ్బరినీళ్లు, చల్లని పండ్ల రసాలూ, చెరకు రసాలూ, మంచినీళ్ల చలివేంద్రాలు… ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తాయి. ఇవి వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు వాటి పక్కన మారేడు జ్యూస్ కూడా వచ్చి చేరింది. కేవలం జ్యూస్ మాత్రమే కాదు… ఈ మారేడు కాయలతో రకరకాల ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చేసాయి. ఈ మారేడు ఫలంలో అపారమైన పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పుచ్చకాయ కట్ చేయకుండానే.. క్వాలిటీని కనిపెట్టేయండి ఇలా..