సేఫ్టీ ఫీచర్స్
ఈకోలో ప్రస్తుతమున్న, రాబోయే అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా 11 భద్రతా ఫీచర్లు ఉన్నాయి. రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, డోర్ల కోసం చైల్డ్ లాక్, సీట్ బెల్ట్ రిమైండర్, ఏబీఎస్ విత్ ఈబీడీ, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. ఈకోలో ఇప్పుడు కొత్త స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. పాత స్లైడింగ్ ఏసీ కంట్రోల్ స్థానంలో కొత్త రోటరీ యూనిట్‌ను ఏర్పాటు చేశారు.