బెంగళూరులోని క్వీన్స్ రోడ్‌లోని రాజీవ్ గాంధీ కాలనీలో మహిళను చూస్తూ ఆమె ముందే ఓ కుర్రాడు తన ప్యాంటు జిప్ తీసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిని ప్రశ్నించిన మహిళ భర్తపై, స్థానికుడిపై దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనలో మొత్తం 7 మంది గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి 10:30 గంటలకు జరిగింది. ఏప్రిల్ 13న ఒక మహిళ భోజనం ముగించి రెండవ అంతస్తులో పడుకోబోతుండగా, ఎదురుగా ఉన్న ఇంటి నుండి కార్తీక్ అనే వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. ప్యాంటు జిప్ తీసి, తన ప్రైవేట్ పార్ట్స్‌ను చూపిస్తూ.. ఆమెను ఆ పని కోసం ప్రేరేపిస్తూ వికృతంగా ప్రవర్తించాడు.
వెంటనే ఆ మహిళ తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అయినా కూడా ఆ కుర్రాడు బెదరకుండా.. ఆమెను బలవంతం చేయబోయాడు. ఇది గమనించిన చుట్టపక్కల వాళ్లు వచ్చి.. అతని నిలదీశారు. దీంతో వారిపై ఆ కార్తీక్ దాడికి తెబడ్డాడు. ఆపడానికి వచ్చిన తన తల్లిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారు ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసియులో చికిత్స పొందుతున్నారు. కార్తీక్ తల్లి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనకు సంబంధించి శివాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు గతంలో చాలా మంది మహిళలతో అనుచితంగా ప్రవర్తించాడని స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.