తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మల్లారం పేద రైతుల సమస్యలపై నుడా చైర్మన్ కేశ వేణు ని కలిసి కార్యాలయంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యులు చంద్రకాంత్, శేఖర్, బాధితులు గంగారాం లు కలిసి వినతి పత్రం అందజేశారు.నిజాంబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామపంచాయతీ పరిధిలోని 423 /28 సర్వేనెంబరులో గత 60 సంవత్సరాల పైగా ఆ గ్రామ నివాసులు గుండుబడ్డ గంగారాం, గుండు వద్ద శ్రీనివాసులు వ్యవసాయం చేసుకుంటున్నారు. రెండు మూడు సంవత్సరాల క్రితం నుంచి మల్లారం గ్రామానికి సంబంధం లేని నిజామాబాద్ నగర వాస్తవ్యులు రజాక్ అతని తమ్ముడు, అనుయాయులు ఒకసారి కోర్టు మొట్టికాయలు వేసినా నిస్సిగ్గుగా భూదాహంతో వీరి భూమిని సైతం కాచేయాలనే కుట్ర చేస్తున్నారు. పైగా వీరికి 395 సర్వే నెంబరులో కేటాయించబడింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 395 సర్వే నెంబర్లు ఒక్క ఎకరం 22 గుంటలు మాత్రమే ఉంది. ఆరు నెలల క్రితం వరకు వారి పేరిట ఆన్లైన్ పాస్ పుస్తకాలలో కూడా ఒక్క ఎకరం 22 గుంటలు మాత్రమే ఉన్నది. వీరు ఏం మాయ చేసారో కానీ ఇటీవల మూడు ఎకరాల ఒక్క గుంటగా ఎక్స్టెన్షన్ చేస్తూ పట్టా పాస్ పుస్తకాలు సంపాదించారు. కాళ్ల చెప్పులు అరిగేటట్లుగా తిరిగినా పేద ప్రజలకు పట్టా పాస్ పుస్తకాలు చేయని ఈ తాసిల్దారులు ఈ ధనవంతులైన బోగస్దారులకు ఎందుకు చేశారు అని అడుగుతున్నాం. అలాగే ప్రభుత్వ భూమి ఒక్క బదరున్నీసా పేరుతోనే ఇప్పటికే 7 ఎకరాలపైననే అదేప్రాంతంలో ఉంది. మళ్ళీ మూడు ఎకరాల ఒక్క గుంట భూమిని ఏ విధంగా ఎక్స్టెన్షన్ చేసిండ్రో తాసిల్దార్ చెప్పాలని పెద్ది వెంకట్రాములు నిలదీస్తున్నారు. ప్రభుత్వాన్ని మోసం చేయడం, చట్టాన్ని దుర్వినియోగం చేయటం, ఆనవాయితిగా మారింది. అధికారులే తప్పులు చేస్తుంటే తప్పులు చేయించుకునే వాడు ఎంతకైనా దిగజారతాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు నుడా చైర్మన్ కి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సమస్యపై స్పందించి పేదలకు సహాయం చేయాలని కోరుతున్నాం. లేనిచో భవిష్యత్తులో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.