
భార్య భర్తల మధ్య చిన్న గొడవతో మనస్థాపానికి చెంది ఫ్యానుకూరేసుకుని మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలువలోకి వచ్చిందని చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ తెలిపారు. గురువారం చౌటుప్పల్ పట్టణం కర్ర భారతి భర్త వాసుదేవరావు వయసు 27 సంవత్సరాలు కులం వెలమ వృత్తి దివిస్ కంపెనీలో వర్కర్ గా విధులు నిర్వహిస్తున్నారు.గణేష్ నగర్ చౌటుప్పల్ నివాసరాలు సొంత గ్రామం శ్రీకాకుళం జిల్లా గురువారం ఉదయం డివిఎస్ కంపెనీకి A షిఫ్ట్ డ్యూటీ కి వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి తన ఇంట్లో ఉన్న భర్తతో కుటుంబ కలహాల వలన ఇద్దరు భార్యాభర్తలు తిట్టుకుని పంచాయతీ పెట్టుకున్నారు . సదరు మృతురాలు మనస్థాపన చెంది తన ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కు చీరతో మెడకు ఉరి వేసుకుని సాయంత్రం నాలుగున్నర గంటలకు చనిపోయినదనీ వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ తెలిపారు.