హీరో నాని తన వాల్ పోస్టర్ సినిమా పతాకంపై సమర్పించిన చిత్రం ‘కోర్ట్’ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రీమియర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇందులో మంగపతి పాత్ర పోషించిన నటుడు శివాజీ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
దాదాపు 12 ఏండ్ల తర్వాత..
దాదాపు 12 ఏళ్ల తర్వాత మంగపతి లాంటి పవర్ ఫుల్ పాత్ర రావడం చాలా ఆనందంగా ఉంది. నా ఫ్యామిలీ, పిల్లలు నన్ను మళ్ళీ యాక్ట్ చేయమని కోరేవారు. నాకూ చేయాలని ఉండేది. కానీ నేను ఎవరినీ అడగలేను. ఈటీవీ బాపినీడుని కలిసి విషయం చెప్పాను. ముందుగా ప్రొడక్షన్ చేద్దామని అనుకున్నాం. అయితే ఆయన యాక్ట్ చేయమని చెప్పారు. అలా నైన్టీస్ వెబ్ సిరిస్ ఓకే చేశాను. అది చేస్తున్నప్పుడు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. నేను ఏంటో తెలియజేసే వేదిక అది. ఆ షోతో అసలు శివాజీ ఏమిటో ప్రపంచానికి తెలిసింది. అదే సమయంలో వెబ్ సిరిస్ కూడా పెద్ద హిట్ అయ్యింది. దాని తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. దాదాపు ఎనభై కథలు విన్నాను. చాలా వరకూ ఫాదర్ రోల్స్ ఉన్నాయి. చాలా వరకూ రిజెక్ట్ చేశాను. ‘కోర్ట్’లో చేసిన మంగపతి క్యారెక్టర్ నా 25 ఏళ్ల కల. నాని ద్వారా ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా వుంది.
నా కోసమే పుట్టిన పాత్ర
ఏం చూసి ఈ క్యారెక్టర్‌కి నన్ను సెలెక్ట్ చేసుకున్నారని డైరెక్టర్‌ని అడిగాను. పగలంతా స్క్రిప్ట్ రాసుకొని, నైట్ టీవీ ముందు కూర్చుంటే మీరు కనిపించేవారు. ఆ పాత్రకి పర్ఫెక్ట్‌గా యాప్ట్ అని సెలెక్ట్ చేసుకున్నా అని చెప్పాడు. నా కోసం ఇలాంటి క్యారెక్టర్ పుట్టిందని భావిస్తున్నాను. డైరెక్టర్ రియల్ లైఫ్ నుంచి ఈ క్యారెక్టర్ తీసుకున్నాడని భావిస్తున్నాను. నా పాత్రకి సంబంధించిన ప్రతిది డైరెక్టర్ క్రెడిట్. నేను ఇది చేయగలనని ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. నా క్యారెక్టర్‌ని డైరెక్టర్ నెక్స్ట్ లెవల్‌లో రాసుకున్నాడు. ఇందులో ప్రతి పాత్రని శిల్పం చెక్కినట్లుగా చెక్కాడు. రీఎంట్రీలో నేను చేసిన పాత్రల్లో మంగపతి ది బెస్ట్. ఈ పాత్రలో సహజమైన ఎమోషన్ ఉంది. ప్రతి కుటుంబంలో అలాంటి ప్రోటక్టీవ్ నేచర్ ఉన్న పర్సన్ ఉంటారు. అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అలానే బిహేవ్ చేస్తాడు. లయ, నేను కలసి ఓ సినిమా చేస్తున్నాం. అలాగే ‘దండోరా’ అనే సినిమా చేస్తున్నాను. నైన్టీస్‌కి సీక్వెల్ ఉంటుంది.

మంగపతి క్యారెక్టర్‌తో నా కల నెరవేరింది –
Written by RAJU
Published on: