భూకంపాలు ఎక్కువగా సంభవించే దేశాలు: భారత్ స్థానం తెలుసా?

Written by RAJU

Published on:

భూకంపాలు ఎక్కువగా సంభవించే దేశాలు: భారత్ స్థానం తెలుసా?

World’s Most Earthquake Prone Countries: మయన్మార్, థాయ్‌లాండ్ లో మార్చి 28న సంభవించిన భూకంపంతో 1000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది గాయపడ్డారు. ఈ రెండు దేశాల్లో భూకంప ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఆయా దేశాల్లోని పరిస్థితులు ఇందుకు కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాలు

ఫిలిప్ఫిన్స్

మెక్సికో

చైనా

ఇండోనేషియా

ఇరాన్

జపాన్

టర్కీ

ఇండియా

అమెరికా

చైనాలో భూకంపాలు

1990 నుంచి చైనాలో అత్యధికంగా భూకంపాలు సంభవించినట్టు నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఓఏఏ నివేదిక చెబుతోంది. ప్రపంచంలో అత్యంత భూకంపాలకు గురయ్యే దేశాల్లో చైనా ఒకటిగా గుర్తించారు. 2008 డిసెంబర్ 05న సిచువాన్ ఫ్రావిన్స్ లో భారీ భూకంపం వాటిల్లింది. అప్పట్లో రెక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.9గా నమోదైంది. ఈ భూకంపంలో అప్పట్లో 87 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా సరిహద్దుల వెంట టెక్టోనిక్ ప్లేట్ల కదలికతో భూకంపాలు సంభవిస్తున్నాయి.

ఇరాన్ లో 109 భూకంపాలు

ఇరాన్ లో 1990 నుంచి 2024 వరకు 109 భూకంపాలు సంభవించాయి. ఇరాన్ లో 1978 సెప్టెంబర్ 16న భారీ భూకంపం వాటిల్లింది. ఇరాన్ లోని టబాస్ ప్రాంతంలో ఇది సంభవించింది. రెక్టర్ స్కేల్ పై 7.8 తీవ్రత నమోదైంది. ఈ భూకంపంతో 20 వేల మంది మరణించారు.

జపాన్ లో తరచూ భూకంపాలు

పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ లో ఉన్న జపాన్ లో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. 2011 మార్చి 11న జపాన్ లో భారీ భూకంపం వాటిల్లింది. రెక్టర్ స్కేల్ పై 9.1 తీవ్రతగా నమోదైంది. పసిఫిక్ మహాసముద్రంలో ఓషికా ద్వీపకల్పానికి సమీపంలో 24 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు.

టర్కీలో 56 వేల మంది మృతి

2023లో టర్కీలో 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో 56,697 మంది చనిపోయారు. తుర్కియేలో సంభవించిన భూకంపంలో అరేబియన్ ప్లేట్ ఉత్తరం వైపు కదులుతూ అనటోలియన్ ప్లేట్ పైకి చేరింది. ఇలా ఆకస్మికంగా భూమిలోని పలకల మధ్య కదలికలతో పుట్టే తరంగాలతో భూమి కంపించింది.

ఇండియాలో భూకంపాలు

భూకంపాలు సంభవించే దేశాల్లో ఇండియాది ఏడో స్థానం. ఇప్పటివరకు ఇండియాలో 58 భూకంపాలు వచ్చినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. పెరుగుతున్న జనాభాతో పాటు బహుళ అంతస్తుల నిర్మాణాలు కూడా భూకంపాలకు కారణమనే అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో హిమాలయ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తున్నాయి.

పిలిఫ్పిన్స్ లో భూకంపాలు

పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న పిలిఫ్పిన్స్ లో భూకంపాలు సాధారణం.తుఫానులు, కొండ చరియలు విరిగిపడడం వంటి ఘటనలు సాధారణంగా మారాయి. దీంతో ఇక్కడ నిపా హట్ వంటి సంప్రదాయ ఇళ్ల నిర్మాణాలు భూకంపాలను తట్టుకునేలా నిర్మించారు.

Subscribe for notification
Verified by MonsterInsights