
భూకంపాలు ఎందుకు ఎలా వస్తాయి?
భూమి లోపల ఉన్న పొరల్లో ఆకస్మికంగా వచ్చే కదలికల వల్ల భూకంపాలు వస్తాయి.భూమి ఉపరితలం ఆకస్మికంగా కంపించడాన్ని కూడా భూకంపం అంటారు.సాధారణంగా ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలో ప్రకంపనలు ఉంటాయి.సాధారణంగా ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలో ప్రకంపనలు ఉంటాయి.
భూకంపాలకు కారణాలుఏంటి?
భూపాతాలు, హిమపాతాలు, అణు ప్రయోగాల నిర్వహణ, సొరంగాలు, గనుల పైకప్పులు కూలిపోవడం వంటివి భూకంపాలకు కారణమౌతాయి. అగ్నిపర్వతాల విస్పోటనం, భూమిలోపల యురేనియం, థోరియం అణు విస్పోటక పదార్ధాలు విఘటనం చెందడం, భూమిపై జరిగే భూ స్వరూప ప్రక్రియలకు భూమి తీవ్రంగా గురైనప్పుడు అది సమతాస్థితికి వచ్చే ప్రయత్నంలో ఏర్పడే కదలికలు భూకంపానికి కారణలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రాథమిక తరంగాలు లేదా పీ తరంగాలు
భూకంప తరంగాలను మూడు రకాలుగా విభజించారు. తొలి తరంగాలను ప్రాథమిక తరంగాలు, పీ తరంగాలు లేదా తోసే తరంగాలు అని కూడా పిలుస్తారు. భూకంప తరంగాలు అతి వేగంగా ప్రయాణించే తరంగాలు. వీటి వేగం సెకనకు 5 సెకనుకు కి.మీ. నుంచి 13.8 కి.మీ వరకు ఉంటుంది. శబ్ద తరంగాలను పోలి ఉంటాయి. వీటిని అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. ఇవి ఘన, ద్రవ పదార్ధాలు రెండింటిలో ప్రయాణిస్తాయి. ఇవి భూ కేంద్ర మండలం ద్వారా ప్రయాణిస్తాయి.
కదిలించే తరంగాలు
ద్వితీయ తరంగాలు లేదా వీటినే కదిలించే తరంగాలు అంటారు. దీని వేగం సెకనుకు 3.2 నుంచి 7.2 కి.మీ. వరకు ఉంటుంది.ఇవి కాంతి తరంగాల మాదిరి పయనించే మార్గానికి లంబ కోణంలో స్పందిస్తాయి. అందుకే వీటిని తిర్యక్ తరంగాలు అంటారు. ఇవి ఘన పదార్ధాల ద్వారా మాత్రమే పయనిస్తాయి. ఇవి భూకేంద్ర మండలం ద్వారా ప్రయాణించలేవు.
ఎల్ తరంగాలు
ఎల్ తరంగాలు వీటిని ర్యాలీ తరంగాలు లేదా ఉపరితల తరంగాలు అంటారు. ఇవి భూపటలం ద్వారా మాత్రమే వర్తులాకారంగా ప్రయాణిస్తాయి. వీటి వేగం సెకనుకు 4 కి.మీ. నుంచి 4.3 కి.మీ. వరకు ఉంటుంది. పీ, ఎస్ తరంగాలు భూ ఉపరితలానికి చేరి దీర్ఘ తరంగాలుగా మారతాయి.