కొత్త తరహా కథలతో రూపొందే డివోషనల్ థ్రిల్లర్స్‌కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు అదే తరహాలో ఓ ఇంట్రెస్టింగ్ డివోషనల్ కథతో రూపొందుతున్న చిత్రం ‘షణ్ముఖ’ కూడా ఆ జాబితాలో చేరడానికి రెడీ అవుతోంది. డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ కథానాయకుడు. అవికాగోర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. ‘శాసనసభ’ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్‌బ్రో ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ, ‘విడుదలకు ముందే ఈ సినిమా అన్ని డిజిటల్ హక్కులు, అన్ని భాషల శాటిలైట్ హక్కులు, థియేట్రికల్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోవడం ఆనందంగా ఉంది. ఈ సినిమా క్రెడిట్ అంతా దర్శక, నిర్మాత షణ్ముగం సాప్పనిదే. రవిబసూర్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తుంది. అవికాతో పనిచేయడం హ్యపీగా ఫీలయ్యాను. మంచి సినిమాకు తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. అలాంటి ఓ మంచి కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.

భిన్న డివోషనల్ థ్రిల్లర్ –
Written by RAJU
Published on: