
నాగమహేష్, రూపాలక్ష్మి, ‘బాహుబలి’ ప్రభాకర్, రచ్చ రవి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కర్మణి’. రమేష్ అనెగౌని దర్శకత్వంలో మంజుల చవన్, రమేష్‌గౌడ్ అనెగౌని నిర్మిస్తున్నారు. రామరాజ్యం మూవీ మేకర్స్, అనంతలక్ష్మి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేవుడి చిత్రపటాలపై సీనియర్ నటుడు నాగమహేష్ క్లాప్ కొట్టారు. నిర్మాత మంజుల చవన్ కెమెరా స్విచాన్ చేశారు. 2022లో డైరెక్టర్ రమేష్ అనెగౌని తెరకెక్కించిన ‘మన్నించవా..’ మూవీకి అప్పట్లో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అదే ఉత్సాహంతో అదే టీమ్‌తో కలిసి చేస్తున్న తాజా ప్రాజెక్ట్ ఇది. ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ అనెగౌని మాట్లాడుతూ, ‘ఫిలింనగర్ దైవసన్నిధానంలో ప్రొరంభోత్సవం జరిగే సినిమాలు సూపర్ హిట్ కొడతాయి. ఈ సెంటిమెంట్ మా ‘కర్మణి’ సినిమాకు కూడా కలుగుతుందని విశ్వాసం ఉంది. మే మొదటి వారంలో తొలి షెడ్యూల్ ప్రారంభి స్తున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే తెలియపరుస్తాం’ అని అన్నారు. ‘ఓ మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం వస్తున్న చిత్రాలతో పోలిస్తే ఈచిత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సాలిడ్ కంటెంట్‌తో మంచి టాలెంట్ ఉన్న టీమ్‌తోనే సినిమా చేస్తున్నాం. ఇండిస్టీకి ఒక మంచి సినిమా అందిస్తామని గర్వంగా చెప్పగలం. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం’ అని నిర్మాత మంజుల చవన్ చెప్పారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రమేష్ అనెగౌని, కెమెరామెన్: జగదీష్ కొమరి, సంగీతం: జాన్ భూషన్, ఎడిటర్: వి.నాగిరెడ్డి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: బలరాం బొమ్మిశెట్టి.