భార్యభర్తల బంధాన్ని బలపర్చే సీక్రెట్స్..! మిస్ అవ్వకండి..!

Written by RAJU

Published on:

భార్యభర్తల బంధాన్ని బలపర్చే సీక్రెట్స్..!  మిస్ అవ్వకండి..!

పెళ్లి అనేది ప్రేమ, నమ్మకం, పరస్పర అర్థం చేసుకోవడమే కాదు.. కొన్ని చిన్న తీయని అబద్ధాలను కూడా సహిస్తుందనే విషయం చాలా మంది ఒప్పుకుంటారు. నిజంగా ప్రేమతో చెప్పే కొన్ని మాటలు బంధాన్ని మరింత బలపరుస్తాయి. మీ భాగస్వామి హృదయాన్ని గెలుచుకోవడానికి, వారి మనోధైర్యాన్ని పెంచడానికి చెప్పే కొన్ని మధురమైన అబద్ధాలు ఏంటో తెలుసుకుందాం.

మీ జీవిత భాగస్వామి ప్రేమతో మీకు ఏదైనా బహుమతి ఇస్తే.. అది మీకు నచ్చకపోయినా ప్రాముఖ్యత ఇవ్వండి. ఇది చాలా బాగుంది, స్పెషల్ గిఫ్ట్ అని చెప్పడం ద్వారా వారిలో ఆనందాన్ని కలిగించవచ్చు. బహుమతి వెనుక ఉన్న ప్రేమను అర్థం చేసుకోవడం ముఖ్యమని గుర్తుంచుకోండి.

పొగడ్త ఎవరికి ఇష్టముండదు.. మనం చెబుతోన్న చిన్న చిన్న ప్రోత్సాహక మాటలు భార్య లేదా భర్తలో విశ్వాసాన్ని పెంచుతాయి. ఇల్లు, ఆఫీసు, పిల్లలు ఇలా అన్ని బాధ్యతలు తీసుకుంటూ మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్న వారికి నువ్వు అద్భుతం అని ఒక్క మాట అన్నా, చాలా శక్తి వస్తుంది. కాబట్టి మంచి క్షణాల్లోనే కాకుండా క్లిష్ట సమయాల్లో కూడా ప్రోత్సహించే మాటలు చెప్పడం చాలా అవసరం.

భార్య లేదా భర్త ఎంతో ప్రేమతో వండిన భోజనం, కొన్నిసార్లు మీకు అంతగా నచ్చకపోవచ్చు. కానీ చాలా బాగుంది అని చెప్పడం ద్వారా వారిలో ఆనందం కలిగించవచ్చు. చిన్న చిన్న పొరపాట్లు పట్టించుకోకుండా వారి కష్టాన్ని గుర్తించి మెచ్చుకోవడం ద్వారా బంధం మరింత బలపడుతుంది.

కొత్తగా డ్రెస్ వేసుకున్నప్పుడు లేదా హెయిర్ స్టైల్ మార్చుకున్నప్పుడు చాలా కొత్తగా ఉన్నావ్ అని ప్రోత్సహించడం అనేది ఒక ప్రేమ పద్ధతి. అయితే మీకు నిజంగా నచ్చకపోయినా వెంటనే నెగటివ్‌గా స్పందించకుండా సున్నితంగా మీ అభిప్రాయాన్ని చెప్పండి.

కొన్నిసార్లు మనం పనిలో బిజీగా ఉంటాము. కానీ భాగస్వామికి నువ్వు గుర్తొస్తున్నావు అనే చిన్న మాట చెప్పడమే వారి హృదయాన్ని తాకుతుంది. ఇది బంధాన్ని మరింత గాఢంగా మార్చే అద్భుతమైన మాట.

పెళ్లిలో నిజాయితీ ఎంతైనా అవసరమే కానీ కొన్ని సందర్భాల్లో ప్రేమతో చెప్పే మధురమైన అబద్ధాలు బంధాన్ని మరింత బలపరచగలవు. ముఖ్యంగా భాగస్వామి మనోధైర్యాన్ని పెంచే మాటలు, మంచి భావోద్వేగాలను కలిగించే పొగడ్తలు, ప్రేమను తెలియజేసే చిన్న మాటలు అనేవి ఒక్కో బంధాన్ని బలపరిచే మార్గాలుగా నిలుస్తాయి.

Subscribe for notification
Verified by MonsterInsights