భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

Written by RAJU

Published on:

భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌మోహన్‌ లాల్‌ హీరోగా పథ్వీరాజ్‌ సుకుమార్‌ తెరకెక్కించిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ‘ఎల్‌2 ఎంపురాన్‌’ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈనెల 27న రిలీజ్‌ చేయబోతోన్నారు. మురళి గోపి అందించిన ఈ కథను లైకా ప్రొడక్షన్స్‌, ఆశీర్వాద్‌ సినిమాస్‌, శ్రీ గోకులం మూవీస్‌ బ్యానర్లపై సుబాస్కరన్‌, ఆంటోనీ పెరుంబవూర్‌, గోకులం గోపాలన్‌ నిర్మించారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా రిలీజ్‌ చేసిన టీజర్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ వదిలిన గ్లింప్స్‌ అందరినీ మెప్పించింది. ఆశీర్వాద్‌ సినిమాస్‌, లైకా ప్రొడక్షన్స్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లలో గత కొన్ని రోజులుగా సినిమాలోని అన్ని పాత్రలను రివీల్‌ చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఖురేషి-అబ్రహం అలియాస్‌ స్టీఫెన్‌ నేడుంపల్లిగా మోహన్‌లాల్‌ పాత్రను గ్రాండ్‌గా రివీల్‌ చేయడంతో అభిమానులలో అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రంలో పథ్వీరాజ్‌ సుకుమారన్‌, టోవినో థామస్‌, గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ ఫేమ్‌ జెరోమ్‌ ఫ్లిన్‌, అభిమన్యు సింగ్‌, ఆండ్రియా తివాదర్‌, సూరజ్‌ వెంజరమూడు, ఇంద్రజిత్‌ సుకుమారన్‌, మంజు వారియర్‌, సానియా అయ్యప్పన్‌, సాయికుమార్‌ తదితరులు నటిస్తున్నారు.

Subscribe for notification